Share News

భారత్ తొలి బుల్లెట్ రైలుకు ముహూర్తం ఫిక్స్.. 2027 నుంచి అందుబాటులోకి బీ28

ABN , Publish Date - Nov 21 , 2026 | 10:44 AM

భారత్‌కు కొన్ని సంవత్సరాలుగా ఉన్న ‘బుల్లెట్ ట్రైన్’ కల నెరవేరే సమయం దగ్గరపడింది. దేశానికి తొలి బుల్లెట్ రైలు - బీ28.. 2027 నుంచే అందుబాటులోకి రానుంది.

 భారత్ తొలి బుల్లెట్ రైలుకు ముహూర్తం ఫిక్స్.. 2027 నుంచి అందుబాటులోకి బీ28

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు కొన్ని సంవత్సరాలుగా ఉన్న ‘బుల్లెట్ ట్రైన్’ కల నెరవేరే సమయం దగ్గరపడింది. దేశానికి తొలి బుల్లెట్ రైలు - బీ28.. 2027 నుంచే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తొలుత ముంబై-వాపి విభాగంలో సర్వీసు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. తరువాత దశలవారీగా నగరమంతా పూర్తి కారిడార్ నిర్మిస్తామని అన్నారు. నిన్న (శుక్రవారం) సబ్‌స్టాక్ బ్లాగ్‌లో పెట్టిన పోస్ట్‌లో రైల్వే మంత్రి బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. సెప్టెంబర్ నాటికి 456 కిలోమీటర్ల వరకు పిల్లర్ పనులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. అలాగే 206 కిలోమీటర్ల మేర వయాడక్ట్ నిర్మించామని పేర్కొన్నారు. ఇతర అన్ని పనులూ వేగంగా కొనసాగుతున్నాయని ఆయన పోస్ట్‌లో చెప్పారు.


కాగా బీ28 రైలును ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. తయారీలో కేవలం స్వదేశి టెక్నాలజీని మాత్రమే వినియోగిస్తున్నాయి. ఈ రైలు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది 202 మీటర్ల పొడవు ఉంటుంది. దీంట్లో 8 కోచ్‌ల దాకా ఉంటాయి. వీటి ద్వారా 557 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవచ్చు. అలాగే దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉండేలా రైలు లోపలి బోగీలను రూపొందించారు.


ఈ వార్తలూ చదవండి

మణిపూర్‌లో కల్తీ మద్యం కలకలం.. 12 మంది మృతి, 180 మందికి అస్వస్థత

మోదీ జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్‌ నేతలే రక్షించారా?

Updated Date - Nov 21 , 2026 | 10:51 AM