Share News

జర్మనీలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 07:25 AM

జర్మనీలోని పలు నగరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలు ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.

జర్మనీలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

బెర్లిన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికుడని జర్మనీలో తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీకాంత్ కుడితిపూడి తెలిపారు. ఆయన దేశం గర్వించదగ్గ నేత అని అభివర్ణించారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్, హాంబర్గ్ నగరాల్లో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రాంక్‌ఫర్డ్‌లో జరిగిన ఈ వేడుకల్లో శ్రీకాంత్ కుడితిపూడి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం చంద్రబాబు అలుపెరుగని కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.

Nri1.jpg


పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఉద్యోగ, ఉపాది అవకాశాలను అన్వేషిస్తున్నారని చెప్పారు. రాజధానికి చట్టబద్ధత కల్పించడమే కాకుండా.. అమరావతి నిర్మాణం పూర్తి చేయడానికి ఆయన అహోరాత్రులు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పవన్ కుర్ర, సుమంత్ కొర్రపాటి తదితరులు సమన్వయపరిచారు.

NRI-2.jpg


అలాగే హాంబర్గ్‌లో జరిగిన వేడుకల్లో డాక్టర్ శివశంకర్ లింగం మాట్లాడుతూ.. విభజిత ఆంధ్రప్రదేశ్‌ను శిథిలం నుంచి శిఖరం వైపు నడిపిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని వివరించారు. సంక్షోభాల నుంచి అవకాశాలను వెదకటం ఆయన నైజమని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారన్నారు.

Nri5.jpg


ఈ కార్యక్రమంలో దినేష్ పాకలపాటి, కిషోర్ దాసుగారి, శ్రీకాంత్ గోళ్ళ, రాజా పులిచర్ల, బ్రౌన్చ్ వైగ్ నగరం నుంచి టిట్టు మద్దిపట్ల, హిల్దిస్ హైం నుంచి రామ రాయలు వట్టికూటి తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శివశంకర్ లింగం, విక్రమ్ తల్లపనేని, శశిధర్ ఏమిరెడ్డి తదితరులు సమన్వయ పరిచారు. సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి.. బెలూన్లు ఎగురవేశారు. ఈ వేడుకలకు భారీగా తెలుగుదేశం పార్టీ అభిమానులు హాజరయ్యారు.NRi-3.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

మెల్‌బోర్న్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ రక్తదాన శిబిరం

For More NRI News And Telugu News

Updated Date - Apr 21 , 2026 | 07:38 AM