Share News

ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ రక్తదాన శిబిరం

ABN , Publish Date - Apr 19 , 2026 | 08:32 PM

తమ ప్రియతమ నేత, టీడీపీ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను గల్ఫ్ దేశాలలోని టీడీపీ అభిమానుల్లో అత్యధికులు ముందస్తుగా నిర్వహించుకుంటున్నారు.

ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ రక్తదాన శిబిరం
Blood Donation Camp By TDP Supporters

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తమ ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను గల్ఫ్ దేశాలలోని టీడీపీ అభిమానుల్లో అత్యధికులు ముందస్తుగా నిర్వహించుకుంటున్నారు.

ఖతర్‌లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు స్థానికంగా అగ్రగామి ఆసుపత్రి అయిన హామద్ మెడికల్ కార్పోరేషన్ (హెచ్.యం.సి)లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శనివారం నిర్వహించిన ఈ బృహత్తర కార్యక్రమానికి ఖతర్‌లోని తెలుగుదేశం అభిమానులు ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం చేసినట్లుగా ఖతర్ ఎన్నారై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబు సేవా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా ఆయన అన్నారు.


కార్యక్రమంలో శాంతయ్య యలమంచిలి, రవీంద్ర మాగులూరి, కవీంద్ర గాలి, కళ్యాణ చక్రవర్తి నార్నే, రమేశ్ దాసరి, అంజనేయులు మోడి, అనిల్ మలసాని, యం.యం.యస్ నాయుడు, రియాజ్ షేఖ్‌‌లతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నట్లుగా రమణయ్య వెల్లడించారు. మొత్తం 65 యూనిట్ల రక్తాన్ని దానం చేసినట్లుగా ఆయన తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

మస్కట్‌లో ప్రతిధ్వనించిన దళిత వాణి

కువైత్‌లో సీఎం చంద్రబాబు అభిమానుల రక్తదాన శిబిరం

Updated Date - Apr 19 , 2026 | 08:40 PM