మస్కట్‌లో ప్రతిధ్వనించిన దళిత వాణి
ABN , Publish Date - Apr 18 , 2026 | 07:44 PM
ఒమాన్ దేశంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మస్కట్, సలాల నగరాలలో వేర్వేరుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత సంఘాలు కార్యక్రమాలను నిర్వహించాయి.
ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఒమాన్ దేశంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మస్కట్, సలాల నగరాలలో వేర్వేరుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత సంఘాలు కార్యక్రమాలను నిర్వహించాయి. మస్కట్‌లో అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారత రాయబారి జి.వి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సేవా సమితి ఇంటర్నేషనల్ అధ్యక్షుడు గాలిగాని రాజు అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షులు రంజిత్, మహిళా విభాగం అధ్యక్షురాలు అంజలిరెడ్డి సమన్వయం చేశారు. అంబేద్కర్ బోధనలు చిరకాలం దిక్సూచిగా ఉంటాయని ఒమాన్ తెలంగాణ సమితి అధ్యక్షుడు నూనె లక్ష్మణ్ అన్నారు.

మస్కట్ నుండి వేయి కిలోమీటర్ల దూరంలోని సలాల నగరంలో జరిగిన ఉత్సవాలకు ఉపాధ్యక్షులు రాకేశ్ అధ్యక్షత వహించగా మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి సమన్వయం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గాలిగాని రాజుకు గత దశాబ్ద కాలంగా ఒమాన్‌లో అంబేద్కర్ ఆశయ సాధనకు అంకితభావంతో పని చేస్తున్నారనే పేరుంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రమాబాయి సేవా సమితి అధ్యక్షురాలు రత్నా (చిన్ని) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనగా ఏపీ దళిత యూత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గడ్డం రాంప్రసాద్ అధ్యక్షత వహించారు.

ఈ వార్తలూ చదవండి:
కువైత్‌లో సీఎం చంద్రబాబు అభిమానుల రక్తదాన శిబిరం
గల్ఫ్‌లో దర్జగా దర్జీలు.. రాణిస్తున్న తెలుగువారు