చీరతో హుందాగా...
ABN , Publish Date - Oct 26 , 2026 | 03:47 AM
చీరకట్టు క్లాసీగా రిచ్‌గా కనిపించేందుకు పాటించాల్సిన చిట్కాలివే..
చీరకట్టు క్లాసీగా రిచ్‌గా కనిపించేందుకు పాటించాల్సిన చిట్కాలివే..
కట్టుకునేముందు ఇస్త్రీ చేస్తే చీర గ్రాండ్‌గా ఉంటుంది. కుచ్చిళ్లను చిన్నగా సమానంగా పెట్టుకోవాలి. అవి నేలకు తాకకుండా ఓ అంగుళం పైకి ఉండేలా చూసుకుంటే నడవడానికి అనువుగా ఉంటుంది. చీర క్లాసీగా కనిపిస్తుంది కూడా.
చీర కొంగుకు అందంగా ప్లీట్స్ పెట్టి భుజంపై సర్ది పిన్ పెట్టుకోవాలి. అదే ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్‌కు వెళ్లేటప్పుడు కొంగును భుజం మీదుగా వన్ స్టెప్ వేసుకుని పిన్ పెడితే అందంగా ఉంటుంది. కొంగు మరీ పొడవుగా కాకుండా ఎత్తుకు తగ్గట్టు సెట్ చేసుకుంటే గ్రేస్‌గా కనిపిస్తారు.
చీర గ్రాండ్‌గా ఉంటే నగలు సింపుల్‌గా ఉండాలి. అదే చీర సింపుల్‌గా ఉంటే కొన్ని నగలు పెట్టుకోవచ్చు. చీరలో హుందాగా కనిపించాలంటే చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని సన్నని గొలుసు వేసుకుంటే చాలు.
చీరకు స్నీకర్స్ నప్పవు. బ్లాక్ హిల్స్ వేసుకుంటే సన్నగా పొడవుగా కనిపిస్తారు. అదే జుట్టీలు ఎంపిక చేసుకుంటే ఎలిగెంట్ లుక్ వస్తుంది.
కాటన్ చీరలకు తప్పనిసరిగా గంజి పెట్టి ఇస్త్రీ చేసుకోవాలి. అప్పుడే అవి గ్రాండ్‌గా కనిపిస్తాయి. పెద్ద పెద్ద ప్రింట్లకు బదులు చిన్న బోర్డర్, చిన్న చెక్స్ ఉన్న కాటన్ చీరలు రిచ్‌గా కనిపిస్తాయి. వీటి మీద జుంకాలు, పెండెంట్ హారం, వెడల్పాటి సింగిల్ గాజులు, గుండ్రని బొట్టు అందంగా నప్పుతాయి.
చీర రంగుకు మ్యాచ్ అయ్చేలా పెటికోట్‌ను ఎంపిక చేసుకోవాలి. దాని నడుము బిగుతుగా ఉంటే చీర జారకుండా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. రోజువారీ ధరించడానికి కాటన్‌వి బాగుంటాయి. జార్జెట్, షిఫాన్, క్రేప్ లాంటి చీరలకు సాటిన్ పెటికోట్లు అందంగా సూటవుతాయి.
చీర కట్టుకున్నప్పుడు ఎక్కువ మేకప్ అవసరం లేదు. తేలికపాటి ఫౌండేషన్, బొట్టు, కాటుక, లిప్‌స్టిక్ సరిపోతాయి. శిరోజాలు జిడ్డుగా లేకుండా చూసుకోవాలి. బన్ స్టయిల్స్, పోనీటైల్, వదులుగా జడ వేసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News