Share News

వాడేసిన టీ బ్యాగ్‌లతో ఇలా...

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:59 AM

వాడేసిన టీ బ్యాగ్‌లను పడేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం...

వాడేసిన టీ బ్యాగ్‌లతో ఇలా...

వాడేసిన టీ బ్యాగ్‌లను పడేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం...

  • వీటిని చిన్న గిన్నెలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. రాత్రి పడుకునేముందు కళ్లపై ఈ చల్లటి టీ బ్యాగ్‌లను పెట్టుకోవాలి. ఉదయానికల్లా కళ్ల కింద నల్లటి వలయాలు, కళ్ల చుట్టూ ఉబ్బు, కళ్లలో ఎరుపుదనం తగ్గిపోతాయి. కళ్లు ప్రకాశవంతంగా మారతాయి.

  • వర్షాకాలంలో చెప్పుల స్టాండ్‌ నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు దాని అరల మూలల్లో వాడేసిన టీ బ్యాగ్‌లను ఉంచితే సమస్య తీరుతుంది. సోఫా ముందున్న కార్పెట్‌, డోర్‌ మ్యాట్‌లపై రాత్రంతా ఈ టీ బ్యాగ్‌లను ఉంచి ఉదయాన్నే తీసేస్తే వాటి నుంచి వచ్చే మట్టి వాసనలు మాయమవుతాయి.

  • వంట చేసేటప్పుడు చేతులకు ఉల్లి, వెల్లుల్లి తదితర ఘాటైన వాసనలు అంటుకుంటుంటాయి. వీటిని సులువుగా పోగొట్టుకునేందుకు రెండు లేదా మూడు టీ బ్యాగ్‌లను తీసుకుని వాటితో చేతులను బాగా రుద్ది కడిగేసుకుంటే సరిపోతుంది.

వార్తలు కూడా చదవండి...

'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Aug 12 , 2026 | 01:59 AM