వెండి వస్తువులు మెరిసేదెలా?
ABN , Publish Date - Oct 14 , 2026 | 02:53 AM
వెండితో తయారుచేసిన పూజ సామాగ్రి, ఆభరణాలు, కంచాలు తదితర వస్తువులు.. గాలిలోని సల్ఫర్‌తో చర్య జరిపి నల్లగా మారుతుంటాయి. వీటిని కొత్తవాటిలా మెరిపించే ఇంటి చిట్కాలివే...
వెండితో తయారుచేసిన పూజ సామాగ్రి, ఆభరణాలు, కంచాలు తదితర వస్తువులు.. గాలిలోని సల్ఫర్‌తో చర్య జరిపి నల్లగా మారుతుంటాయి. వీటిని కొత్తవాటిలా మెరిపించే ఇంటి చిట్కాలివే...
గిన్నెలో నాలుగు చెంచాల గోధుమ పిండిని వేసి తగినంత నీటిని చిలకరిస్తూ పేస్టులా చేయాలి. దీన్ని వెండి వస్తువులకు పట్టించి గాలికి ఆరనివ్వాలి. ఆపైన పాత టూత్‌బ్ర్‌షతో రుద్ది గోరువెచ్చటి నీటితో కడిగేస్తే నలుపుదనం మాయమై వెండి వస్తువులు తెల్లగా కొత్తగా మెరుస్తాయి.
తెల్లటి టూత్ పౌడర్ లేదా టూత్ పేస్టును పాత బ్రష్ సహాయంతో వెండి వస్తువులకు పట్టించి మెల్లగా రుద్ది టిష్యూ పేపర్‌తో తుడిచేస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
వెండి వస్తువులకు టమాటా కెచ్‌పను పట్టించి పావుగంటసేపు అలాగే ఉంచాలి. తరువాత వాటిపై చల్లటి నీటిని చిలకరిస్తూ పాత బ్రష్‌తో రుద్ది కడిగితే సమస్య తీరుతుంది.
ఓ గిన్నెలో గోరువెచ్చటి నీటిని తీసుకుని అందులో చెంచా డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి కలపాలి. ఆపైన ఈ నీటిలో వెండి ఆభరణాలు ఉంచి అయిదు నిమిషాల తరువాత వాటిని చేత్తో మృదువుగా రుద్ది మంచినీటితో కడిగేస్తే సరిపోతుంది. రత్నాలు, ముత్యాలతో ఉన్న ఆభరణాలకు ఇది చక్కని చిట్కా.
వెండి వస్తువులు, ఆభరణాలను శుభ్రం చేసిన తరువాత వాటిమీద ఏమాత్రం తడిలేకుండా గాలికి ఆరబెట్టాలి. ఆపైన గాలి తగలకుండా జిప్‌లాక్ కవర్లలో లేదా వెల్వెట్ బాక్సుల్లో భద్రపరచాలి.
ఇవి కూడా చదవండి...
.స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ ఏం చెప్పారంటే
గన్నవరం ఎయిర్‌పోర్టుకు తమిళనాడు సీఎం విజయ్.. ఘన స్వాగతం
Read Latest AP News And Telugu News