పెరుగుకూ ఓ లెక్కుంది.!
ABN , Publish Date - May 16 , 2026 | 01:16 AM
పెరుగును తీసుకునేటప్పుడు చేసే చిన్న పొరబాట్ల వల్ల కడుపు ఉబ్బరం, మొటిమలు, శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. వేసవికాలంలో...
పెరుగును తీసుకునేటప్పుడు చేసే చిన్న పొరబాట్ల వల్ల కడుపు ఉబ్బరం, మొటిమలు, శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. వేసవికాలంలో పెరుగును ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం...
ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి పెరుగును వెంటనే ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాకాకుండా అరగంట ముందే పెరుగును బయటికి తీసి అది సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకున్నాక తీసుకోవడం మంచిది.
రాత్రి పూట పెరుగు తినడం వల్ల అజీర్ణం, జలుబు, గొంతు సమస్యలు రావచ్చు. కాబట్టి అందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొన్ని నీళ్లు కలుపుకుని తీసుకోవడం మంచిది.
చిక్కటి పెరుగును నేరుగా తినకూడదు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగలవచ్చు. కడుపులో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు పెరుగును ఎక్కువగా తినకూడదు. ప్రత్యామ్నాయంగా వీరు పలుచని మజ్జిగ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.
చక్కెర కలిపిన తియ్యటి పెరుగు తినడం వల్ల శరీరం బరువు పెరుగుతుంది. రాత్రిపూట నిద్రాభంగం కలగవచ్చు. కాబట్టి చక్కెర మోతాదును తగ్గించడం మంచిది.
పెరుగులో తగినన్ని నీళ్లు పోసి బాగా చిలికి మజ్జిగ తయారుచేయాలి. అందులో చిటికెడు నల్ల ఉప్పు, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి కలుపుకుని తాగితే తేలికగా జీర్ణమవుతుంది. కడుపులో చల్లగా అనిపిస్తుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.
ఒక కప్పు పెరుగులో పావు కప్పు కీరా తురుం, కొన్ని దానిమ్మ గింజలు, కొద్దిగా పుదీనా తరుగు వేసి బాగా కలిపి తినవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి...
రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు
Read Latest Telangana News And AP News And International News And Telugu News