మష్రూమ్స్ తిందాం
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:21 AM
శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉన్నాయి. జంతు మాంసకృత్తులు జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ పుట్టగొడుగుల్లోని...
పోషకాహారం
శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉన్నాయి. జంతు మాంసకృత్తులు జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ పుట్టగొడుగుల్లోని మాంసకృత్తులు అత్యంత సులువుగా జీర్ణమవుతాయి. 60 ఏళ్లు దాటిన వారిలో సహజంగానే మెదడు కణాలు క్షీణించి పోతుంటాయి. ఫలితంగా మతిమరుపును కలిగించే డిమెన్షియా వ్యాధి మొదలవుతుంది. అయితే వారానికి రెండు సార్లు, మొత్తం 300 గ్రాముల ఉడికించిన పుట్టగొడుగులు తిన్నవారిలో ఈ సమస్య 50 శాతం మేరకు తగ్గడాన్ని పరిశోధకులు కనుగొన్నారు. అయితే వారంలో రెండు దఫాలే కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినే వారికి పుట్టగొడుగుల వల్ల కలిగే ప్రయోజనం మరింత ఎక్కువగా ఉంటుందని కూడా వారు కనిపెట్టారు. నాడీకణాల క్షీణత వల్ల వృద్దుల్లో మతిమరుపుతో పాటు భాషా సామర్థ్యం తగ్గిపోతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. అయితే పుట్టగొడుగులు ఈ లోపాల్ని చాలా వరకు పూరిస్తాయి. పుట్టగొడుగుల్లో ప్రత్యేకించి మన శరీరం తనకు తానుగా ఉత్పత్తి చేసుకోలేని ఒక అరుదైన అమినో యాసిడ్ ఉంటుంది. అది ఈ విశేష ప్రయోజనాలన్నీ కలిగిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి వృద్దులు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
For More National News And Telugu News