మనుషుల మేధస్సు క్షీణిస్తోందా?
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:52 AM
కాలక్రమేణా మనుషుల మేధోసామర్థ్యాలు క్షీణిస్తున్నట్టు జన్యుపరమైన అధ్యయనాలు సూచిస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే మనుషులు...
అధ్యయనం
కాలక్రమేణా మనుషుల మేధోసామర్థ్యాలు క్షీణిస్తున్నట్టు జన్యుపరమైన అధ్యయనాలు సూచిస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే మనుషులు అంతకంతకూ దబుద్ధులవుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం!
మన పూర్వీకులు ఆహారాన్ని సమకూర్చుకునే క్రమంలో తెలివితేటలు, జ్ఞాపకశక్తితో పాటు అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొనేవారు. మన ఆధునిక సమాజం తెలివిగా నడుచుకోడానికి అవసరమైన పరిణామ ఒత్తిడి నుంచి మనకు రక్షణ కల్పిస్తూ ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. మనుషుల కాగ్నిటివ్ సామర్ధ్యానికి కారణమయ్యే జన్యువుల నెట్‌వర్క్ కాలక్రమేణా ఉత్పరివర్తనాలకు గురవడం మొదలుపెట్టింది. ప్రాచీన కాలం నాటి రోజువారీ జీవన్మరణ మేథో పరీక్షలను ఎదుర్కొనే సందర్భాలు కొరవడడంతో, హానికారకమైన జన్యు ఉత్పరివర్తనాలు మన జన్యువుల్లో నెమ్మదిగా పేరుకుపోతూ, వందల తరాలుగా మన ప్రాథమిక మేథో సామర్థ్యాన్ని నిశ్శబ్దంగా క్షీణింపచేస్తున్నాయంటూ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ జన్యు శాస్త్రవేత్త, డాక్టర్ గెరాల్డ్ క్రాబ్‌ట్రీ పేర్కొంటున్నారు. ఈ జన్యు క్షీణత ఎంతో నెమ్మదిగా సాగుతుందనీ, ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తూ ఉంటుందనీ ఆయన పేర్కొంటున్నారు. అయితే మన తాత ముత్తాతల తరంతో పోల్చితే, మనది తెలివైన తరంగా కనిపించడానికి కారణాలు లేకపోలేదు. విద్యాపరమైన పురోగతులు, ప్రినేటల్ కేర్, మెరుగైన బాల్య పోషకాహారం, గ్యాసొలీన్, పెయింట్ల నుంచి సీసం తొలగింపు లాంటి కొన్ని అంశాల కారణంగా మన సగటు ఐక్యు స్థాయులు పెరిగి ఉండొచ్చు. కానీ సవాళ్లను ఎదుర్కొని, వాటిని అధిగమించడానికి అవసరమైన మేథస్సు మనలో క్రమేపీ క్షీణిస్తోందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News