Share News

మడమ నొప్పి వేధిస్తే?

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:31 AM

ఈ సమస్య... ప్లాంటార్‌ ఫాసియైుటిస్‌. ప్రతి పది మందిలో ఒకరు జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్లాంటార్‌ ఫాసియైుటిస్‌ సమస్యతో బాధపడతారు. ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలోనే రెండింతలు ఎక్కువ. ఎక్కువ మందిలో...

మడమ నొప్పి వేధిస్తే?

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! మడమ నొప్పితో కాలు కింద పెట్టలేకపోతున్నాను. పొద్దున్నే నడక నరకాన్ని చూపిస్తోంది. ఈ నొప్పి తగ్గే మార్గం వివరించండి

- ఓ సోదరి, హైదరాబాద్‌.

ఈ సమస్య... ప్లాంటార్‌ ఫాసియైుటిస్‌. ప్రతి పది మందిలో ఒకరు జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్లాంటార్‌ ఫాసియైుటిస్‌ సమస్యతో బాధపడతారు. ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలోనే రెండింతలు ఎక్కువ. ఎక్కువ మందిలో ఒక పాదానికి అరుదుగా కొందరిలో రెండు పాదాలకు ఒకే సమయంలో ఈ సమస్య రా వొచ్చు. అయితే ఎక్కువ సందర్భాల్లో ఈ నొప్పి ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే దానంతటదే సర్దుకుంటూ ఉంటుంది. కానీ అలా తగ్గిపోకుండా అంతకంతకూ పెరుగుతుంటే చికిత్స తీసుకోవాల్సిందే!

విశ్రాంతి: ప్లాంటార్‌ ఫాసియా మీద ఒత్తిడి తగ్గితే నొప్పి తగ్గిపోతుంది. పాదానికి రెస్ట్‌ ఇవ్వటంవల్ల ఈ నొప్పిని అదుపు చేయొచ్చు.

చెప్పులు మార్చాలి: పాదంలోని ఒంపుకు సపోర్ట్‌ ఇచ్చే మెత్తని ఆర్థోపెడిక్‌ చెప్పులు ధరిస్తే చాలావరకూ నొప్పి తగ్గిపోతుంది. షూలో హీల్‌ ప్యాడ్స్‌ వాడటం అలవాటు చేసుకోవాలి.

స్ట్రెచింగ్‌: పాదం అడుగున ఉండే ప్లాంటార్‌ ఫాసియాను వదులు చేయటం కోసం ఫిజియోథెరపిస్ట్‌ సహాయంతో తేలికపాటి స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ చేయాల్సి ఉంటుంది.

ఐస్‌ ప్యాక్‌: ఐస్‌ క్యూబ్స్‌తో నొప్పి ఉన్నచోట ప్యాక్‌ వేయటం వల్ల నొప్పి అదుపులోకొస్తుంది.

పెయిన్‌ కిల్లర్స్‌: నొప్పి అదుపు చేయటం కోసం కొంతకాలంపాటు పెయిన్‌ కిల్లర్స్‌ వాడక తప్పదు.

నైట్‌ స్ల్పింట్స్‌: ప్లాంటార్‌ ఫాసియా స్ట్రెచ్‌ అయ్యేందుకు రాత్రి పూట పాదానికి స్ప్లింట్స్‌ ధరించాలి. దీని వల్ల ఉపశమనం ఉంటుంది.


చికిత్స ఇలా...

షాక్‌వేవ్‌ థెరపీ: ఎక్స్‌ట్రా కార్పొరియల్‌ షాక్‌వేవ్‌ థెరపీ ద్వారా హై ఎనర్జీ సౌండ్‌ వేవ్స్‌ నొప్పి ఉన్న ప్రదేశంలో విడుదలయ్యేలా చేసే చికిత్స ఇది. దీని వల్ల ప్లాంటార్‌ ఫాసియా గాయం మాని నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.

స్టిరాయిడ్‌ ఇంజక్షన్‌: పై చికిత్సా పద్ధతుల వల్ల నొప్పి అదుపులోకి రాకపోతే మడమలోకి స్టిరాయిడ్‌ ఇంజక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇంజక్షన్‌తో రెండు రోజుల్లోనే నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

సర్జరీ: ఇంజక్షన్‌ చేసినా నొప్పి మళ్లీ మళ్లీ తిరగబెడుతూ సంవత్సర కాలానికి మించి వేధిస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే సర్జరీని ఆశ్రయించాలి. సర్జరీ ద్వారా ప్లాంటార్‌ ఫాసియా పట్టీకి కోత పెట్టి వదులు చేస్తారు. దాంతో నొప్పి తగ్గిపోతుంది.

డాక్టర్‌ దశరధరామిరెడ్డి

సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌, హైదరాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి..

తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..

For More National News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 02:31 AM