పండ్లు తినాలా? జ్యూస్ తాగాలా?
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:54 AM
మధుమేహం ఉంటే పండ్లకు దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ పండ్లు మానేయడం కంటే వాటిని ఎలా...
మధుమేహం ఉంటే పండ్లకు దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ పండ్లు మానేయడం కంటే వాటిని ఎలా తీసుకుంటున్నామన్నదే ముఖ్యం. నేరుగా తినాలా? రసం చేసుకుని తాగాలా? నిపుణులు చెబుతున్నది ఇదే..
పీచు పదార్థం: పండును నేరుగా తిన్నప్పుడు అందులోని పీచు పదార్థం రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తుంది. జ్యూస్‌లో పీచు ఉండదు, కాబట్టి చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి.
ఆకలి నియంత్రణ: పండును నమిలి తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. జ్యూస్ తాగితే త్వరగా ఆకలి వేస్తుంది.
పోషకాలు: పండును నమలడంవల్ల లభించే పూర్తిస్థాయి ఎంజైములు, విటమిన్లు జ్యూస్‌లో అందవు.
చక్కెరను నియంత్రించే పండ్లు
దానిమ్మ: యాంటీఆక్సిడెంట్లు పుష్కలం
ద్రాక్ష: ఇన్సులిన్ పనితీరును మెరుగు పరుస్తుంది.
ఆపిల్: తొక్కతో తింటే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ: ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి.
జామ: పీచుపదార్థం ఎక్కువగా ఉండి జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
పుచ్చకాయ: కిడ్నీల ఆరోగ్యానికి, నరాల సమస్యలకు మంచిది.
చెర్రీ: ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.
బొప్పాయి: కణాల నష్టాన్ని నివారిస్తుంది.
నారింజ: చక్కెర గ్రహించే వేగాన్ని తగ్గిస్తుంది.
ఇవి కూడా చదవండి..
ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
For More National News And Telugu News