ఫ్లాస్క్ బాటిల్స్‌ని శుభ్రం చేస్తున్నారా...
ABN , Publish Date - May 11 , 2026 | 05:13 AM
మంచినీళ్లు, పాలు, కాఫీ లేదా టీలను ఫ్లాస్క్ బాటిల్స్‌లో పోసి వెంట తీసుకెళుతుంటాం. ఈ బాటిల్స్‌ని సరైన విధానంలో శుభ్రం చేయని పక్షంలో వాటి లోపల ఫంగస్ పెరిగి...
మంచినీళ్లు, పాలు, కాఫీ లేదా టీలను ఫ్లాస్క్ బాటిల్స్‌లో పోసి వెంట తీసుకెళుతుంటాం. ఈ బాటిల్స్‌ని సరైన విధానంలో శుభ్రం చేయని పక్షంలో వాటి లోపల ఫంగస్ పెరిగి దుర్వాసన వస్తుంది. అలాకాకుండా ఫ్లాస్క్ బాటిల్స్‌ని సులువుగా శుభ్రం చేసే చిట్కాలివి...
ఫ్లాస్క్ బాటిల్స్‌లో రోజూ వేడినీళ్లు నింపి మూతపెట్టి అరగంటసేపు ఉంచాలి. తరువాత వాటిని వేగంగా అటూ ఇటూ ఊపి నీటిని పారబోయాలి. మరోసారి మంచినీళ్లతో కడిగితే బాటిల్స్ శుభ్రంగా ఉంటాయి. అయినాకూడా బాటిల్స్‌ని వారానికోసారి డిష్ వాషింగ్ లిక్విడ్ కలిపిన నీళ్లతో కడుగుతూ ఉండాలి.
ఫ్లాస్క్ బాటిల్స్ లోపల పాలు, టీ, కాఫీల వాసనలు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి కొన్ని వేడి నీళ్లు చిలకరించాలి. పొడవాటి బ్రష్ సహాయంతో లోపలి గోడలను అడుగు భాగాన్ని గట్టిగా రుద్దాలి. ఆపైన బాటిల్స్‌ని మంచినీటితో కడిగితే సమస్య తీరుతుంది
చిన్న గిన్నెలో వెనిగర్, వేడినీళ్లను సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్లాస్క్ బాటిల్స్‌లో పోసి పావుగంటసేపు ఉంచి కడిగితే వాటిలోని దుర్వాసనలు తొలగిపోతాయి.
బాటిల్స్‌లో అయిదారు ఐస్ క్యూబ్స్, చెంచా ఉప్పు వేసి మూతపెట్టి వేగంగా షేక్ చేయాలి. తరువాత వేడినీటితో కడిగేస్తే మరకలు, వాసనలు తొలగి బాటిల్స్ తాజాగా ఉంటాయి.
బాటిల్స్ మూతలను కూడా డిష్ వాషింగ్ లిక్విడ్, బేకింగ్ సోడా, వెనిగర్‌లలో ఒకదాన్ని ఉపయోగిస్తూ స్పాంజ్ లేదా బ్రష్‌తో తోమి శుభ్రం చేస్తుండాలి. మూతలకు రబ్బర్ సీల్స్ లేదా సిలికాన్ గ్యాస్కెట్స్ ఉంటే వాటిని ఓపెన్ చేసి కడగడం మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News