ఎనర్జీ డ్రింక్స్ ఎంచుకోవద్దు!
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:01 AM
తక్షణ శక్తినిచ్చే పానీయాలుగా ఎనర్జీ డ్రింక్స్ ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కొన్ని ప్రముఖ బ్రాండ్లు, వాటి...
పారాహుషార్
తక్షణ శక్తినిచ్చే పానీయాలుగా ఎనర్జీ డ్రింక్స్ ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కొన్ని ప్రముఖ బ్రాండ్లు, వాటి ఉత్పత్తుల మీద ‘ఎనర్జీ డ్రింక్’ అనే లేబుల్ వేసుకోవడాన్ని నిషేఽధించింది. ఎందుకో తెలుసుకుందాం!
ప్రస్తుత ఆహార భద్రత మార్గదర్శకాల ప్రకారం, ‘శక్తిని పెంచే’ అనే పదాలను ఉపయోగించడం భారతీయ చట్ట రీత్యా ఆమోదయోగ్యం కాదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటివరకూ ఎనర్జీ డ్రింక్స్ ఉత్పత్తుల కోసం ఎలాంటి ప్రమాణాలనూ నిర్దేశించలేదు. ఈ తరహా ఉత్పత్తులన్నీ ఎఫ్‌ఎ్‌సఎస్ నిబంధనల్లోని ఆహార వర్గీకరణ వ్యవస్థ పరిధిలోకి వస్తాయి. ఇది పేరు పెట్టడానికీ, లేబుల్ వేయడానికి ఉద్దేశించినది కాదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం, ఆహార ఉత్పత్తుల పైన... ‘ఎనర్జీని పెంచుతుంది’, ‘ఏకాగ్రతను మెరుగు పరుస్తుంది’, అలసటను పోగొడుతుంది’ లాంటి ప్రకటనలకు అనుమతి లేదు. ఇంతకూ ఎఫ్‌ఎ్‌సఎస్ ఎనర్జీ డ్రింక్స్ మీద ఇలాంటి నిబంధనలను ఎందుకు అమలు చేస్తోంది? ఈ పానీయాలు అవి ప్రకటించుకుంటున్నట్టు తక్షణ శక్తినీ, ఏకాగ్రతను పెంచుతాయా?
పరిశోధకులు ఏమంటున్నారు?
ఈ శీతల పానీయాలు అత్యధిక కెఫీన్ కలిగిన పానీయాలేనా లేదంటే వాటిలో ఇంకేవైనా ఆందోళనకరమైన అంశాలున్నాయా? అనే అంశం గురించి శాస్త్రవేత్తలు, ప్రజా ఆరోగ్య నిపుణులు ఎన్నో ఏళ్లుగా చర్చలు జరుపుతున్నారు. చక్కెర, కెఫీన్ కలిసిన పానీయాలు ఆరోగ్యానికి తీవ్రమైన హానిని తలపెడతాయని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. ఇవి శక్తిని అందించవనీ, శరీర దారుఢ్యాన్ని పెంచడానికి ఏ విధంగానూ ఉపయోగపడవనీ, బదులుగా మెదడును ఉత్తేజపరుస్తూ, చక్కెరను పెంచుతూ అలసటను తాత్కాలింగా తగ్గిస్తాయని మాత్రమే పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అకస్మాత్తుగా రక్తంలో చక్కెర మోతాదులను పెంచే ఈ పానీయాలకు అలవాటు పడే ప్రమాదం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఎనర్జీ డ్రింక్స్‌లో ఏముంది?
శక్తినీ, సామర్థ్యాన్నీ, మెదడు చురుకుదనాన్నీ పెంచుతాయని ప్రకటించుకునే ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్ మినహా, రహస్య దినుసుల్లాంటివేవీ ఉండవు. వ్యాయామంలో కోల్పోయే ఎలకొ్ట్రలైట్స్, ఇతర ద్రవాలను భర్తీ చేసే స్పోర్ట్స్ డ్రింక్స్‌కు భిన్నంగా ఈ ఎనర్జీ డ్రింక్స్ నాడీ వ్యవస్థను ప్రేరేపించేలా రూపొందాయి. ఈ ఎనర్జీ డ్రింక్స్‌లో ప్రధానంగా కెఫీన్, టారిన్, చక్కెరతో పాటు గారానా, ఎల్ కార్నిటిన్, జిన్‌సెంగ్, గ్లూకోరోనోలాక్టోన్ లేదా ఐనోసిటోల్ లాంటి దినుసులుంటాయి. వీటన్నింట్లో కీలక పాత్ర పోషించే దినుసు కెఫీన్ ఒక్కటే! ఇది నిద్రను దూరం చేయడంతో పాటు, విశ్రాంతిని ప్రేరేపించే మెదడులోని అడినోసిన్ అనే రసాయనాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా మెదడు తాత్కాలిక చురుకుదనం పొందుతుంది. ఈ పరిస్థితి అడ్రినలిన్ హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుంది. తద్వారా గుండె వేగం, రక్తపోటు, శ్వాస వేగం పెరుగుతాయి. ఎనర్జీ డ్రింక్స్‌లోని చక్కెరల వల్ల రక్తంలో గ్లూకోజ్ మోతాదులో విపరీతంగా పెరుగుతాయి. ఎఫ్‌ఎ్‌సఎస్ పేర్కొన్న అనేక ఎనర్జీ డ్రింక్స్‌లో దాదాపు 27 గ్రాముల అదనపు చక్కెర ఉంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం, ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఒక రోజు మొత్తంలో తీసుకోదగిన గరిష్ఠ చక్కెర పరిమితి ఇది. అలాగే ఇలా అదనపు చక్కెరతో అకస్మాత్తుగా పెరిగే శక్తి స్థాయులు అంతే వేగంగా పడిపోతాయి. దాంతో ఈ పానీయాలను మళ్లీ మళ్లీ తాగాలనే కోరిక పెరుగుతుంది.
ప్రత్యామ్నాయాలున్నాయి
ఎనర్జీ డ్రింక్స్‌ను మించిన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు మనకెన్నో అందుబాటులో ఉన్నాయి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, బార్లీ నీళ్లు, రాగి జావ... ఇవన్నీ ఆరోగ్యకరమైన, బలవర్థకమైన పానీయాలే! ఇవన్నీ రక్తంలో చక్కెర మోతాదులను స్థిరంగా ఉంచి, అదనపు శక్తిని అందించేవే! కాబట్టి ఆరోగ్యానికి హానికారకమైన ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకుండా, ఆరోగ్యానికి మేలు చేసే, శక్తినిచ్చే పానీయాలను ఎంచుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News