Share News

పిల్లల కణాలు తల్లుల్లో...

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:23 AM

గర్భావస్థలో పిల్లల కణాలు బొడ్డుతాడు గుండా తల్లి శరీరంలోకి ప్రవహించి, శాశ్వతంగా అక్కడే ఉండిపోయి, జీవితాంతం తల్లి ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తూ...

పిల్లల కణాలు తల్లుల్లో...

పరిశోధన

గర్భావస్థలో పిల్లల కణాలు బొడ్డుతాడు గుండా తల్లి శరీరంలోకి ప్రవహించి, శాశ్వతంగా అక్కడే ఉండిపోయి, జీవితాంతం తల్లి ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తూ ఉంటాయనే ఒక శాస్త్రీయ వాస్తవం వెలుగులోకొచ్చింది. ఆ వివరాలు...

శాస్త్రవేత్తలు... కొడుకుల కణాలను 70 ఏళ్ల తల్లి మెదడులో, కూతుర్ల కణాలను 40 ఏళ్ల తల్లి గుండెలో కనుగొన్నారు. అయితే ఆ కణాలు కేవలం ఉనికిని చాటుకోవడమే కాకుండా, తల్లి అవయవాలతో సమన్వయమవుతూ కొన్ని జీవక్రియలకు తోడ్పడుతూ ఉండడాన్ని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించడంతో పాటు, దెబ్బతిన్న కణజాలాలను మరమ్మత్తు చేస్తున్నట్టు, గుండెపోటు తదనంతరం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్టు కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో చేపట్టిన ఒక అధ్యయనంలో, రొమ్ము క్యాన్సర్‌ సోకిన మహిళను పరిశీలించినప్పుడు, ఆమె శరీరంలోని క్యాన్సర్‌ కణుతుల్లో పిల్లల కణాలను పరిశోధకులు కనిపెట్టారు. ఈ కణాలు క్యాన్సర్‌ కణాలతో పోరాడుతూ, వాటిని నాశనం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపించాయి. ప్రసవం తర్వాత కూడా పిల్లల కణాలను మోస్తూ జీవించే తల్లికి, ఆ కణాలు జీవితకాలం పాటు రక్షణ కల్పిస్తూనే ఉంటాయనే విషయం రుజువైంది కాబట్టి ఈ కణాలు తల్లి రోగనిరోధక వ్యవస్థను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో, వ్యాధుల నుంచి కోలుకోవడంలో ఎంతటి పాత్రను పోషిస్తాయో తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలకు పూనుకోబోతున్నారు.

ఇవి కూడా చదవండి..

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

For More National News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 03:23 AM