రక్తహీనత బలాదూర్
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:26 AM
నీరసం, నిస్సత్తువ, కళ్లు తిరగ డం, గుండె దడ, ఆయాసం, చికాకు, మానసిక కుంగుబాటు... ఇవన్నీ రక్తలేమి లక్షణాలే! వీటికి తోడు అతి నిద్ర, జుట్టు రాలిపోవడం, నోటి పూత, కాళ్లూ చేతుల్లో తిమ్మిర్లు...
అనీమియా
నీరసం, నిస్సత్తువ, కళ్లు తిరగ డం, గుండె దడ, ఆయాసం, చికాకు, మానసిక కుంగుబాటు... ఇవన్నీ రక్తలేమి లక్షణాలే! వీటికి తోడు అతి నిద్ర, జుట్టు రాలిపోవడం, నోటి పూత, కాళ్లూ చేతుల్లో తిమ్మిర్లు కూడా వేధిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలను వదిలించుకోవాలంటే రక్తలేమిని సరిదిద్దుకోవాలి. అందుకోసం...
ఆహారం ద్వారా రోజూ మనం తీసుకునే ఇనుము సహజంగా 10 నుంచి 12 శాతం మాత్రమే జీర్ణమవుతుంది. అందువల్ల ఆహారంలో కనీసం 10 నుంచి 15 మి.గ్రాముల ఐరన్ ఉండేలా చూసుకోవాలి. శాకాహారంతో పోలిస్తే, మాంసాహారంలోనే ఇనుము ఎక్కువ. అయితే, ఆకు కూరల్లోనూ, టీ వంటి పానీయాల్లో ఉండే ఫైలేట్స్ , ఫాస్పేట్స్ వల్ల ఇనుము అరుగుదల కాస్త తగ్గుతుంది. అయితే పండ్లలో ఉండే విటమిన్- సి వల్ల ఇనుము అరుగుదల పెరుగుతుంది.
రక్తహీనత కారణాలు
రుతుస్రావం, గర్భధారణల కారణంగా, కొంత మంది స్త్రీలు రక్తహీనతకు గురవుతారు. రుతుస్రావం వల్ల స్త్రీలు నెలకు 20 మిల్లీగ్రాముల దాకా ఐరన్ కోల్పోతారు. పౌష్టికాహార లోపం వల్ల, పూర్తిగా శాకాహారం వల్ల, బలమైన పోషకాహారం తీసుకోకుండానే బిడ్డలకు పాలివ్వడం వల్ల ఐరన్ లోపం ఏర్పడవచ్చు
పెప్టిక్ అల్సర్లు, గ్యాస్ట్రైటిస్, ఇసోఫెజైటిస్, డెవర్టిక్యులైటిస్, మొలలు, పేగుల్లో కణుతులు, అన్నాశయ క్యాన్సర్ల వల్ల కూడా రక్తహీనత ఏర్పడవచ్చు. పేగులకు లేదా అన్నాశయానికీ జరిగే శస్త్ర చికిత్సల కారణంగా, వాంతులు లేదా విరోచనాల ద్వారా రక్తాన్ని కోల్పోవడం వల్ల కూడా రక్తహీనత రావచ్చు
కొన్ని రకాల ఔషఽధాలు, కార్టికో స్టిరాయిడ్లు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ వంటి ఔషధాల వల్ల కూడా ర క్తహీనత రావచ్చు. మూత్ర పిండాల జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా రక్తహీనత ఏర్పడుతుంది.
చికిత్సలున్నాయి...
ఐరన్ మాత్రలు వేసుకోవడం వల్ల కొందరికి వాంతులు, విరోచనాలు లేదా మలబద్దకం, పొట్ట నొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. మరికొందరికి నలుపు లేదా ఆకు పచ్చని రంగులో విరోచనాలు కావచ్చు. కాకపోతే ఈ దుష్ప్రభావాలు అతి తక్కువ మందిలోనే కనిపిస్తాయి. మాత్రలు పడని వారు ఇంజక్షన్ల రూపంలో ఐరన్ తీసుకోవచ్చు. ఈ చికిత్సలతో ఒకటి రెండు వారాల్లోనే హిమోగ్లోబిన్ పెరగడం ప్రారంభమై, 6 నుంచి 8 వారాల్లో హిమోగ్లోబిన్ మామూలు స్థాయికి వచ్చేస్తుంది.
వైద్య పరీక్షల్లో....
హిమోగ్రామ్ వంటి రక్తపరీక్షల ద్వారా, హిమోగ్లోబిన్, హిమటోక్రిట్ స్థాయిలు మామూలు కంటే తక్కువగా ఉన్నాయేమో గమనించాల్సి ఉంటుంది. అదే క్రమంలో సీరం ఐరన్, సీరం ఫెరిటిన్ వంటి కొన్ని ఇతర పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
For More National News And Telugu News