Share News

ఆ స్పర్శ బతికించింది

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:25 AM

మరణించిన వ్యక్తి మళ్ళీ బతికిన కథలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మత గ్రంథాల్లో కనిపిస్తాయి. అయితే మృతదేహం స్పర్శవల్ల మరో మృతుడు సజీవుడైన కథ...

ఆ స్పర్శ బతికించింది

దైవమార్గం

మరణించిన వ్యక్తి మళ్ళీ బతికిన కథలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మత గ్రంథాల్లో కనిపిస్తాయి. అయితే మృతదేహం స్పర్శవల్ల మరో మృతుడు సజీవుడైన కథ బైబిల్‌లో కనిపిస్తుంది. ఇది క్రీస్తు పుట్టడానికి దాదాపు 1300 వందల ఏళ్ళ క్రితం జరిగింది.

ఇశ్రాయేలీయ దేశం అద్భుతాలకు పెట్టింది పేరు. ఆ దేశం మహోజ్వలంగా వర్థిల్లడాన్ని చూసి ఆనందించిన ప్రవక్తలు ఎందరో ఉన్నారు. వారిలో ఏలియా ఎంతో గొప్పవాడు. సశరీరుడై మోక్షానికి వెళ్ళిన మహనీయుడు. తన కాలంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏలియాకు ప్రియ శిష్యుడు ఎలిషా. ఆ ‘ఎలిషా’ అనే పదానికి ‘దేవుడే నా రక్షణ’ అని అర్థం. ఎలిషా ఉన్నంతవరకూ ఇశ్రాయేలీయ రాజ్యాన్ని శాంతితో నిలిపి సంరక్షించాడు. ముఖ్యంగా సిరియన్ల చెర నుంచి ఇశ్రాయేలీయులను స్వతంత్రుల్ని చేశాడు. ఎలిషా మరణానంతరం... ఆయన మృతదేహాన్ని ఒక సమాధిలో ఉంచారు.

ఇశ్రాయేలు మీద శత్రువులైన మోయాబీయులు హఠాత్తుగా దండెత్తారు. అప్పుడు జనం భయపడి పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక సంఘటన జరిగింది. అప్పటికే వారిలో మరణించిన వ్యక్తి ఒకరున్నారు. ఒకవైపు శత్రువులు తరుముకొస్తున్నారు. వారు అక్కడే ఉండలేని పరిస్థితి. మరోదారిలో వెళ్ళలేని పరిస్థితి. మృతదేహాన్ని వదిలిపెట్టలేక.. దాన్ని భుజాల మీద మోస్తూ పరుగులు తీశారు. కొంత దూరం వెళ్ళాక అలిసిపోయారు. ఒక చోట విశ్రాంతికి ఆగారు. మృతదేహాన్ని దగ్గర్లో ఉన్న సమాధిలో ఉంచారు. తాము ఎవరికీ కనిపించకుండా దాక్కున్నారు.

శత్రువులు తమను దాటి పోయిన తరువాత... సమాధి దగ్గరకు వెళ్ళి చూశారు. అందులో తాము తీసుకువచ్చిన మృతదేహం లేదు. చుట్టూ వెతికితే... మరణించిన ఆ వ్యక్తి లేచి అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఈ అద్భుతానికి వారందరూ ఆశ్చర్యపోయారు. అతను ఎలా బతికాడని తమలోతాము చర్చించుకున్నారు. వారికి చివరకు తెలిసింది... ఆ మృతదేహాన్ని తాము దాచి ఉంచినది.... మహాప్రవక్త ఎలిషా సమాధిలో అని. మహనీయుడైన ఎలిషా ఎముకల స్పర్శ తగిలి... మరణించిన ఆ వ్యక్తి సజీవుడయ్యాడు. మృతుడు తిరిగి బతికాడు. అది చూసి విస్మయం చెంది, ఆనందించిన ఇశ్రాయిలీయులు తమ దైవాన్ని ఘనంగా స్తుతించారు. క్రీస్తుకు పూర్వం నాటి ప్రవక్తల కథల్లో సుప్రసిద్ధమైన వాటిలో ఇది ఒకటి.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఈ వార్తలు కూడా చదవండి..

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 13 , 2026 | 01:25 AM