Share News

లోపాలు లేని చర్మం కోసం

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:54 AM

లోపాలు లేని చర్మం కోసం అన్వేషణ క్రమేపీ ఒక వ్యసనంగా మారుతోంది. ఇప్పుడు వైద్యులు దీనికో పేరును కూడా కేటాయించారు. అదే.... ‘కాస్మెటికోరెక్సియా’...

లోపాలు లేని చర్మం కోసం

మీకు తెలుసా?

లోపాలు లేని చర్మం కోసం అన్వేషణ క్రమేపీ ఒక వ్యసనంగా మారుతోంది. ఇప్పుడు వైద్యులు దీనికో పేరును కూడా కేటాయించారు. అదే.... ‘కాస్మెటికోరెక్సియా’!

లోపాలు లేని చర్మం కోసం పదే పదే సౌందర్య చికిత్సలను ఆశ్రయించేవారి వ్యసనాన్ని చర్మ వైద్యులు ‘కాస్మెటికోరెక్సియా’గా పేర్కొంటున్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తులు, అవసరానికి మించి సౌందర్య ఉత్పత్తులను ఆశ్రయించడంతో పాటు, అవసరం లేకపోయినా సౌందర్య చికిత్సలను చేయించుకుంటూ ఉంటారు. డెర్మటాలజీ అండ్‌ థెరపీలో ఈ ఏడాది ప్రచురితమైన ఎడిటోరియల్‌లో ఇటాలియన్‌ పరిశోధకులు ఈ పదాన్ని ఉపయోగిం చడంతో, ఈ పేరు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చర్మ భద్రత పరిశ్రమలు, సామాజిక మాధ్యమాల వల్ల చర్మ రక్షణ, చికిత్సల పట్ట సర్వత్రా ఆసక్తి పెరిగింది. మరీ ముఖ్యంగా యువత మచ్చలేని చర్మం కోసం అందుబాటులో ఉన్న చికిత్సలన్నిటినీ ఆశ్రయించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. ఫలితంగా అలర్జిక్‌ కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌, బ్యారియర్‌ డిస్‌రప్షన్‌, అందంగా కనిపించాలనే తాపత్రయం లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. ‘కాస్మెటికోరెక్సియా’ ఇప్పటివరకూ ఒక రుగ్మతగా అధికారిక గుర్తింపు పొందక పోయినప్పటికీ, దీని గురించిన పరిశోధనలు జరగవలసిన అవసరం ఎంతైనా ఉందని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 12:55 AM