Share News

ముల్తానీమట్టితో ఇలా

ABN , Publish Date - May 11 , 2026 | 05:10 AM

జిడ్డు, మొటిమలు, మచ్చలు లేకుండా ముఖం ఛాయగా నిగారించడానికి ముల్తానీమట్టితో పాటించాల్సిన చిట్కాలు ఇవే...

ముల్తానీమట్టితో ఇలా

జిడ్డు, మొటిమలు, మచ్చలు లేకుండా ముఖం ఛాయగా నిగారించడానికి ముల్తానీమట్టితో పాటించాల్సిన చిట్కాలు ఇవే.

  • వెడల్పాటి గిన్నెలో అర కప్పు గ్రీన్‌ టీ డికాషన్‌ను తీసుకుని అందులో చెంచా ముల్తానీమట్టి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లయ్‌ చేయాలి. పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మ రంధ్రాలు శుభ్రమై ముఖానికి ఫేషియల్‌ లుక్‌ వస్తుంది.

  • ఒక గిన్నెలో పావు కప్పు పెరుగును తీసుకుని అందులో రెండు చెంచాల ముల్తానీమట్టి, చిటికెడు పసుపు వేసి బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లటినీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మం పొరల్లో తేమనిండి ముఖం తాజాగా ప్రకాశిస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే కళ్ల కింద నల్లని వలయాలు, ఎండ వల్ల ఏర్పడిన ట్యాన్‌ తొలగిపోతాయి.

  • ముల్తానీమట్టిలో గులాబీ నీళ్లు కలిపి ప్యాక్‌లా తయారుచేసి ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ ప్యాక్‌ చక్కగా పనిచేస్తుంది. దీన్ని రెండు రోజులకోసారి అప్లయ్‌ చేసుకుంటూ ఉంటే మొటిమలు తగ్గుతాయి.

  • రెండు చెంచాల ముల్తానీమట్టిలో అయిదు చెంచాల పాలు, చెంచా తేనె వేసి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం తేమతో నిండి బిగుతుగా మారుతుంది. ఈ ప్యాక్‌ పొడి చర్మం ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించి ముఖం మృదువుగా మెరిసేలా చేస్తుంది.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల ముల్తానీమట్టి, చెంచా కాఫీ పొడి వేసి చల్లటి నీళ్లు చిలకరిస్తూ పేస్టులా చేయాలి. దీన్ని చేత్తో కొద్దికొద్దిగా తీసుకుంటూ ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తరువాత సున్నితంగా మర్దన చేస్తూ ప్యాక్‌ను తొలగించాలి. ఆపైన ముఖంపై చల్లటి నీళ్లు చిలకరించుకుంటూ శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండురోజులకోసారి చేస్తూ ఉంటే రక్తప్రసరణ మెరుగై ముఖం చక్కగా నిగారిస్తుంది.

  • గిన్నెలోకి రెండు చెంచాల కలబంద గుజ్జును తీసుకుని అందులో చెంచా ముల్తానీమట్టిని వేసి కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే ఎండ వల్ల కమిలిన చర్మం మామూలు స్థితికి వస్తుంది. ట్యాన్‌ కూడా తగ్గుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 05:10 AM