Share News

వీటితో అందం అదుర్స్‌

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:00 AM

అందానికి మెరుగులు దిద్దే సాధనాలెన్నో నేడు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటి ఉపయోగాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!...

వీటితో అందం అదుర్స్‌

మేకప్‌

అందానికి మెరుగులు దిద్దే సాధనాలెన్నో నేడు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటి ఉపయోగాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!

అత్యాధునిక ఫేషియల్‌ డివైజెస్‌ మొదలు, మల్టీ స్టైలింగ్‌ హెయిర్‌ టూల్స్‌ వరకూ నేడు మార్కెట్లో పలు రకాల సౌందర్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే...

ఎల్‌ఇడి లైట్‌ థెరపీ: ఎల్‌ఇడి ఫేస్‌ మాస్క్‌, మల్టీ ఫంక్షనల్‌ వాండ్స్‌ వేర్వేరు కాంతి తరంగదైర్ఘ్యాలను, మైక్రోకరెంట్స్‌ను ఉపయోగిస్తూ, చర్మానికి చక్కని మెరుపును సంతరించిపెడతాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మంలోకి కొల్లాజెన్‌ పెరగడంతో పాటు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. అలాగే చర్మం మీద ముడతలను తొలగించే సీరమ్‌ను కూడా చర్మం మెరుగ్గా శోషించుకోగలుగుతుంది.

సోనిక్‌ ఫేషియల్‌ క్లీన్సింగ్‌ బ్రషెస్‌: ఈ పరికరం టి సోనిక్‌ పల్సేషన్స్‌, అలా్ట్ర సాఫ్ట్‌ సిలికాన్‌ టచ్‌పాయింట్స్‌ సహయంతో, చర్మం మీద పేరుకున్న జిడ్డు, ధూళిలను 99ు మేరకు తొలగిస్తుంది. అలాగే మేకప్‌ తొలగించిన తర్వాత ముఖం మీద మిగిలిపోయే మేకప్‌ అవశేషాలను కూడా పూర్తిగా తొలగిస్తాయి.

ఐస్‌ రోలర్స్‌, క్రయో టూల్స్‌: కళ్ల కింద వాపును తగ్గించి, చర్మరంథ్రాలను బిగుతుగా మలిచి, లింఫాటిక్‌ డ్రైనేజీని ప్రేరేపిస్తాయి.

మల్టీఫంక్షనల్‌ ఎయిర్‌ స్టైలర్స్‌: వంకీల జుట్టు కోసం, వెంట్రుకలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగపడతాయి.

ఎలక్ట్రిక్‌ స్కాల్ప్‌ మసాజర్స్‌: కంపించే ఈ స్కాల్ప్‌ పరికరాలు రక్తప్రసరణను మెరుగుపరిచి, టెన్షన్‌ను తొలగించి, వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడతాయి.

ఎలక్ట్రిక్‌ ఫేషియల్‌ హెయిర్‌ రిమూవర్స్‌: నొప్పి కలిగించని ఈ పోర్టబుల్‌ ట్రిమ్మర్స్‌తో ముఖం మీదుండే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.

ఎల్‌ఇడి మిర్రర్స్‌: కలర్‌ లైటింగ్‌ను సర్దుబాటు చేసుకునే వీలున్న ఈ ట్రై ఫోల్డ్‌ టచ్‌ మిర్రర్స్‌తో తక్కువ వెలుగుతో కూడిన ప్రదేశాల్లో కూడా మేకప్‌ వేసుకోవచ్చు.

ఫేస్‌ రోలర్స్‌: ముఖం వాపును తగ్గించి, రక్తప్రసరణను పెంచి చక్కని మెరుపును అందిస్తాయి. ప్రతి రోజూ ఐదు నుంచి పది నిమిషాల పాటు వాడుకోదగిన సౌందర్య పరికరమిది.

బ్లాక్‌హెడ్‌ ప్యాచ్‌: ముక్కు మీదా చుబుకం మీదా తలెత్తే బ్లాక్‌హెడ్స్‌ను తొలగించే ఈ ప్యాచ్‌కు వ్యానిటీ బ్యాగ్‌లో తప్పనిసరిగా చోటు కల్పించుకోవాలి.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 05:01 AM