జొమాటోలో ఇక అనలాగ్ పనీర్‌కు నో.. కానీ రెస్టారెంట్లు మోసం చేస్తే గుర్తించేదెలా..
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:17 PM
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ప్లాట్‌ఫామ్‌లో అనలాగ్ డెయిరీ ప్రొడక్ట్స్‌తో తయారు చేసిన వంటకాలను విక్రయించడంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ప్లాట్‌ఫామ్‌లో అనలాగ్ డెయిరీ ప్రొడక్ట్స్‌తో తయారు చేసిన వంటకాలను విక్రయించడంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనను ఉల్లంఘించే రెస్టారెంట్లను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే అనలాగ్ డెయిరీని ఉపయోగిస్తున్నట్లు ప్రకటించిన వంటకాలను జొమాటో డీలిస్ట్ చేసింది (Zomato analogue paneer ban).
జొమాటో ప్రకటన బాగానే ఉంది కానీ, ఇక్కడే మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక రెస్టారెంట్ అనలాగ్ పనీర్ వాడుతున్నట్లు జొమాటోకు చెప్పకపోతే ఏం చేస్తారు? రెస్టారెంట్లు స్వయంగా సమాచారం ఇస్తేనే చర్యలు తీసుంటారా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. నిజమైన పనీర్ పేరుతో అనలాగ్ పనీర్‌ను అందిస్తున్న రెస్టారెంట్లు నిజం ఎందుకు అంగీకరిస్తాయని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు (Zomato food safety fake paneer).
అనలాగ్ పనీర్ అనేది సాంప్రదాయ పాలతో తయారు చేసే పనీర్ కాదు. దీనిని పాల పదార్థాలతో కాకుండా నాన్-డెయిరీ పదార్థాలతో తయారు చేస్తారు. పాల కొవ్వుకు బదులుగా తక్కువ ఖర్చుతో లభించే వెజిటబుల్ ఆయిల్స్‌ను ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి సురక్షితం కాదు. అనలాగ్ లేదా నాన్-డెయిరీ పనీర్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ ఫేక్ పనీర్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయంపై నిషేధాలు అమల్లోకి వచ్చాయి (Non-dairy paneer).
జొమాటో తీసుకున్న తాజా నిర్ణయం వినియోగదారుల ఆహార భద్రత, పారదర్శకత దిశగా ఒక అడుగుగా కనిపిస్తోంది (Zomato restaurant policy). కానీ రెస్టారెంట్ ఏం ప్రకటించింది? అన్నదానికంటే రెస్టారెంట్ నిజంగా ఏం వాడుతోంది? అన్నది నిర్ధారించడం కీలకం. అందుకే జొమాటోకు ఇప్పుడు ఎదురవుతున్న అసలు సవాలు అనలాగ్ పనీర్‌ను నిషేధించడం కాదు.. నిషేధాన్ని ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లను ఎలా గుర్తించి చర్యలు తీసుకుంటుందన్నదే. ఆ తనిఖీ విధానం స్పష్టమైతేనే ఈ కొత్త పాలసీపై వినియోగదారుల్లో పూర్తి నమ్మకం ఏర్పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల పౌరసత్వం తప్పనిసరి.. అమెరికా మరో నిబంధన..
చావు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చాడు.. షాకింగ్ వీడియో వైరల్..