Share News

దోషులను వదిలేది లేదు.. రామాలయం విరాళాల చోరీ వివాదంపై యోగి

ABN , Publish Date - Jun 19 , 2026 | 02:57 PM

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. దోషులు ఎవరైనప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శుక్రవారంనాడు అయోధ్య పర్యటనలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

దోషులను వదిలేది లేదు.. రామాలయం విరాళాల చోరీ వివాదంపై యోగి
Yogi Adityanath

లక్నో: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తొలిసారి స్పందించారు. దోషులు ఎవరైనప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శుక్రవారంనాడు అయోధ్య పర్యటనలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రామభక్తుల మనోభావాలను దెబ్బతినే ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని ప్రజలను కోరారు. ఎవరివద్దనైనా డాక్యుమెంటరీ సాక్ష్యాలు ఉంటే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందానికి (SIT) సమర్పించాలని కోరారు.


ఆయోధ్య టెంపుల్ ట్రస్ట్ చేసిన విజ్ఞప్తితో సిట్ ఏర్పాటు చేశామని, వాస్తవాలను సిట్ వెలుగులోకి తీసుకువస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. గౌరవం, సహనం వంటి శ్రీరాముని ఆదర్శాలను భక్తులు అనుసరించాలని, అయోధ్య, రామ జన్మభూమి ఆలయంపై ఎలాంటి దుష్ట్రచారానికి ఒడిగట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రామాలయ ఉద్యమాన్ని సమాజ్‌పార్టీ, కాంగ్రెస్ వ్యతిరేకించాయని, గత ప్రభుత్వాలు రామభక్తులు, కరసేవకులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నాయని గుర్తుచేశారు.


అయోధ్యపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలభిస్తోందని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బూటకపు ఆందోళన చేస్తోందన్నారు. కోర్టులో సైతం రామాలయ ఉద్యమాన్ని ఆ పార్టీ నిస్సిగ్గుగా వ్యతిరేకించిందని చెప్పారు. రాముడే లేడంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు సమర్పించిందని అన్నారు. ఇదే పార్టీ ఇప్పుడు రామభక్తులకు అవమానం జరగిందంటూ అవిశ్రాంతంగా విమర్శలకు దిగుతోందని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ సైతం రామభక్తులను వంచించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇదే వ్యక్తులు జైశ్రీరామ్ నినాదాలు చేసినందుకు కరసేవకులపై ఎందుకు కాల్పులు జరిపారో, ఎందుకు లాఠీలు ఝలిపించారో చెప్పాలన్నారు. ఇప్పుడు ఇతరులకు సుద్దులు చెబుతున్నారని ఘాటుగా విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

అయోధ్య విరాళాల చోరీ వివాదం..సీసీటీవీ ఫుటేజీ ట్యాంపరింగ్‌

సీఎం విజయ్‌కు ఊరట.. బలపరీక్షపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు

Updated Date - Jun 19 , 2026 | 02:59 PM