అయోధ్య విరాళాల చోరీ వివాదం..సీసీటీవీ ఫుటేజీ ట్యాంపరింగ్
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:43 AM
అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ జరిగిందన్న కేసు విచారణలో.. సీసీ కెమెరాల ఫుటేజీ ట్యాంపరింగ్ అయినట్లు సిట్ గుర్తించింది.
11నెలల్లో భద్రత కోసమే 11కోట్ల ఖర్చు
సిట్ విచారణలో వెల్లడి
అయోధ్య, జూన్ 18: అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ జరిగిందన్న కేసు విచారణలో.. సీసీ కెమెరాల ఫుటేజీ ట్యాంపరింగ్ అయినట్లు సిట్ గుర్తించింది. ఆలయ ప్రాంగణంలో వరుసగా మూడోరోజు ము మ్మరంగా తనిఖీ చేసిన అధికారులు.. అక్కడి నిఘా వ్యవస్థను, రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించా రు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌శంకర్ అలియాస్ టిన్ను యాదవ్‌ను గంటల తరబడి ప్ర శ్నించారు. గత 11నెలల్లో ఆలయ భద్రతా ఏర్పాట్ల కోసమే ఏకంగా రూ.10కోట్ల వరకు ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అంత భారీగా నిధులు వెచ్చించినప్పటికీ, విరాళా ల పెట్టెల నుంచి నగదు, నగలు మాయమవడం.. భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని అధికారులు భావిస్తున్నారు. దీంతో భద్రతా విభాగంలో లోపాలున్నాయా?.. సిబ్బంది హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. దీంతోపాటు విరాళాల లెక్కింపు ప్రక్రియ, అందులో పాల్గొన్న బ్యాంకు అధికారుల పాత్రను కూడా సిట్ పరిశీలిస్తోంది. లెక్కింపు సమయంలో ట్రస్ట్ ఉద్యోగుల కంటే.. బ్యాంకు సిబ్బంది సంఖ్యే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ట్రస్ట్ సీనియర్ అధికారుల కింద పనిచేసే ఉద్యోగులు, భద్రతా, గేట్ చెకింగ్ సిబ్బంది, సీసీటీవీ పర్యవేక్షకుల సర్వీసు రికార్డులను అధికారులు సేకరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద నెట్‌వర్క్ ఉండి ఉం టుందని భావిస్తున్న సిట్.. విచారణకోసం 200 మందితో కూడిన పెద్ద జాబితాను సిద్ధం చేసింది. ఇందులో 125మందికి పైగా వ్యక్తులను ఇప్పటికే విచారించింది.