Share News

మహిళా ప్రయాణికురాలికి డ్రైవర్ మెసేజ్‌లు.. ర్యాపిడో స్పందన ఏంటంటే..

ABN , Publish Date - Apr 20 , 2026 | 09:14 PM

ప్రస్తుతం చాలా నగరాల్లో ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి బైక్, ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి నుంచే త్వరగా తమ గమ్యస్థానాలకు చేరాలనుకునే వారు వీటిని ఆశ్రయిస్తున్నారు. వ్యక్తిగత మొబైల్ నెంబర్లతో క్యాబ్, బైక్ బుకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు.

మహిళా ప్రయాణికురాలికి డ్రైవర్ మెసేజ్‌లు.. ర్యాపిడో స్పందన ఏంటంటే..
Rapido driver inappropriate messages

ప్రస్తుతం చాలా నగరాల్లో ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి బైక్, ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి నుంచే త్వరగా తమ గమ్యస్థానాలకు చేరాలనుకునే వారు వీటిని ఆశ్రయిస్తున్నారు. వ్యక్తిగత మొబైల్ నెంబర్లతో క్యాబ్, బైక్ బుకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇదే అదునుగా కొందరు డ్రైవర్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలికి తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది (Rapido driver inappropriate messages).


ఘజియాబాద్‌లో తన గమ్యస్థానానికి వెళ్లేందుకు ఓ మహిళ ర్యాపిడో బుక్ చేసుకుంది. రైడ్ పూర్తయిన తర్వాత ఆమెకు వాట్సాప్‌ ద్వారా డ్రైవర్ నుంచి 'హాయ్' అంటూ ఓ మెసేజ్ వచ్చింది. అనంతరం ఆ డ్రైవర్ 'మీరు చాలా క్యూట్‌గా ఉన్నారు. ట్రెడిషనల్ దుస్తుల్లో మీరు చాలా అందంగా ఉన్నారు. మీ వయసెంత?' అంటూ ఆమెను ఇబ్బందికి గురి చేసే ప్రశ్నలు అడిగాడు. అంతటితో ఆగకుండా ఒంటరిగా ఉంటున్నట్లయితే.. తర్వాతి రోజు 4 గంటలకు కలవమని కోరాడు (Rapido reaction).


సదరు ప్రయాణికురాలు ఆ ర్యాపిడో డ్రైవర్ నంబర్ బ్లాక్ చేసి.. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది (Viral Video). నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో ర్యాపిడో స్పందించింది. ఆ డ్రైవర్ అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పింది. రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, రైడ్ ఐడీ ద్వారా సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు..


త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..

Updated Date - Apr 20 , 2026 | 09:44 PM