Share News

2027లో వైట్‌ కాలర్‌ ఉద్యోగాల జోరు

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:13 AM

దేశంలో వైట్‌ కాలర్‌(కార్యాలయాల్లో పనిచేసే వృత్తిపరమైన) ఉద్యోగ నియామకాలు వచ్చే ఏడాది జోరందుకోనున్నాయి.

2027లో వైట్‌ కాలర్‌ ఉద్యోగాల జోరు
jobers

ముంబై: దేశంలో వైట్‌ కాలర్‌(కార్యాలయాల్లో పనిచేసే వృత్తిపరమైన) ఉద్యోగ నియామకాలు వచ్చే ఏడాది జోరందుకోనున్నాయి. 2027లో ఈ నియామకాలు 8.16శాతం పెరిగి 1.38 కోట్లకు చేరుకుంటాయని ఫౌండిట్‌ ఇన్‌సైట్స్‌ ట్రాకర్‌ (ఫిట్‌) అంచనా వేసింది. రంగాలవారీగా చూస్తే.. కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యధికంగా 14.25 శాతం వైట్‌ కాలర్‌ ఉద్యోగ నియామకాలు పెరగనున్నాయి. ఆ తర్వాత రిటైల్‌లో 13.99శాతం తయారీలో 12శాతంబ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా రంగంలో (బీఎఫ్ఎస్ఐ)లో 10శాతం లాజిస్టిక్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌లో 10శాతం మేర నియామకాలు పెరగనున్నాయి. హైదరాబాద్‌లో వచ్చే ఏడాది వైట్‌ కాలర్‌ ఉద్యోగ నియామకాలు 10.33 శాతం మేర పెరగనున్నాయి. దేశంలో అత్యధికంగా కోయింబత్తూర్‌లో 12.52 శాతం, బెంగళూరులో 11.29 శాతం మేర నియామకాల్లో వృద్ధి నమోదు కానుంది. తన పోర్టల్‌లో జాబ్‌ పోస్టింగ్‌ల డేటా ఆధారంగా ఫౌండిట్‌ ఈ నివేదికను రూపొందించింది. ఈ ఏడాది జనవరి- అక్టోబరు కాలంలో స్వచ్ఛంద సంస్థల్లో 19.44 శాతం, రియల్‌ ఎస్టేట్‌లో 16.09 శాతం, పర్యాటక రంగంలో 13.76 శాతం చొప్పున నియామకాల్లో వృద్ధి నమోదైంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాల్లో 20 శాతం పెరుగుదల కనిపించింది. దీనిపై ఫౌండిట్‌ సీఈవో తరుణ్‌ సిన్హా స్పందిస్తూ.. ఐటీ రంగం వెలుపల కూడా టెక్‌ ఉద్యోగాలకు బలమైన డిమాండ్‌ ఉందన్నారు. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత ఫార్మా ఇప్పటికే బలమైన స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఫార్మా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలోనూ(జీసీసీలు) తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. దేశంలో ఏర్పాటైన ఫార్మా జీసీసీలు ఇప్పటికే 1.20లక్షల మందికి ఉపాధి కల్పించడమే కాకుండా సుమారు రూ.97,440 కోట్ల అదనపు విలువ(జీవీఏ)ను సృష్టించాయి.

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట..!

Updated Date - Nov 24 , 2026 | 04:14 AM