విజయ్ శిబిరంలో.. మాజీ సీఎం కిరణ్ బావమరిది విష్ణురెడ్డి!
ABN , Publish Date - May 11 , 2026 | 05:58 AM
పైన ఫొటోలో వృత్తంలో ఉన్న వ్యక్తి పేరు విష్ణు రెడ్డి. తమిళనాడు సీఎం విజయ్ రెండు రోజుల కిందట ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరుతూ గవర్నర్ అర్లేకర్‌ను కలిసిన సందర్భంగా...
పార్టీ సహా ఆర్థిక వ్యవహారాల్లో విజయ్‌కు చేదోడువాదోడు
కలికిరి, మే 10(ఆంధ్రజ్యోతి): పైన ఫొటోలో వృత్తంలో ఉన్న వ్యక్తి పేరు విష్ణు రెడ్డి. తమిళనాడు సీఎం విజయ్ రెండు రోజుల కిందట ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరుతూ గవర్నర్ అర్లేకర్‌ను కలిసిన సందర్భంగా తీసిన ఫొటో ఇది. దీనిలో గవర్నర్‌కు ఎడమ వైపు ఉన్న రెండో వ్యక్తి విష్ణు రెడ్డి. విజయ్‌కు అత్యంత సన్నిహితుడైన ఈయన గురించి తమిళ మీడియా సహా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. విష్ణు రెడ్డిని గ్రానైట్ క్వారీల యజమానిగా చెబుతున్నారు. విష్ణు రెడ్డి పూర్తి పేరు ఎర్రదొడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. స్వస్థలం కలికిరి మండలం ఎర్రదొడ్డిపల్లె. పదిహేనేళ్లుగా ఆయన గ్రానైట్ వ్యాపారం చేస్తూ చెన్నైలో ఉంటున్నారు. ఆయన తండ్రి రామనారాయణరెడ్డి అద్దవారిపల్లె సర్పంచ్‌గా, మహల్ ఎంపీటీసీగా, కలికిరి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా పనిచేశారు. వీరి ఉమ్మడి కుటుంబం ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. రామనారాయణ రెడ్డి సతీమణి(విష్ణు తల్లి) స్వయానా కలికిరి మాజీ ఎంపీపీ నల్లారి ఆనంద రెడ్డి సోదరి. అంతేగాకుండా మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ రెడ్డి సోదరిని కూడా ఆ కుటుంబంలోని వారికే ఇచ్చి వివాహం చేశారు. మొత్తం మీద ప్రస్తుతం తమిళనాడు సీఎం శిబిరంలో ప్రధానమైన వ్యక్తిగా ప్రచారంలో ఉన్న విష్ణు రెడ్డి.. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సొంత మండలానికేగాకుండా, కుటుంబానికి కూడా అత్యంత సమీప బంధువు(బావమరిది) కావడం విశేషం. ప్రభుత్వ ఏర్పాటు కసరత్తులో భాగంగా టీవీకే అధినేత విజయ్ ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన సందర్భంగా ఆయనతో వెళ్లడమంటే విష్ణు రెడ్డి విజయ్‌కు ఎంత ప్రాధాన్యమిచ్చారనే విషయంపై తమిళ మీడియా, సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. విష్ణు రెడ్డి విజయ్‌కు చాలా ఏళ్లుగా అత్యంత సన్నిహితుడని, టీవీకే పార్టీ వ్యూహకర్త అని, ఆర్థిక వ్యవహారాల్లో సహాయకారిగా ఉన్నారని కూడా చెబుతున్నారు. విజయ్ సినిమాల పర్యవేక్షణ విషయాల్లో కూడా విష్ణు రెడ్డి చురుగ్గా ఉన్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News