పేపర్ ప్లేట్‌లో బ్యాంకు డిటైల్స్ ప్రత్యక్షం.. ఫొటో వైరల్..
ABN , Publish Date - Jan 29 , 2026 | 01:56 PM
మనం ఎంతో గోప్యంగా ఉంచుకునే బ్యాంక్ వివరాలు.. తినే పేపర్ ప్లేట్‌లో చూసి ఓ వ్యక్తి షాక్ తిన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: కస్టమర్ వివరాలు ఉన్న బ్యాంక్ పేపర్(Bank Paper)తో తయారు చేసిన పేపర్ ప్లేట్ (Paper plate) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూస్తుంటే.. కస్టమర్ల వ్యక్తిగత వివరాలు ఉన్న బ్యాంక్ పేపర్లు.. స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో(Street food centers) పేపర్ ప్లేట్లుగా, పొట్లాలుగా ఉపయోగిస్తున్నట్లు అర్థమవుతోంది. మెరన్ హ్యూమర్ (Moranhumor) అనే ‘ఎక్స్’ (ట్విట్టర్) యూజర్ రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్ సెంటర్‌కి వెళ్లాడు. చాట్ తిన్న తర్వాత పేపర్ ప్లేట్‌ని చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు.
ఆ పేపర్ ప్లేటు ప్రముఖ కార్పొరేట్ బ్యాంక్ అప్లికేషన్ పేపర్‌గా గుర్తించాడు. అందులో కస్టమర్‌కి సంబంధించిన పేరు, అడ్రస్, పేమెంట్ డిటైల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని వివరాలు కొట్టి వేసినట్లు ఉన్నా, అవి కూడా బాగానే కనిపిస్తున్నాయి. వెంటనే ఆ పేపర్ ప్లేట్‌ని ఫొటో తీసి ‘భారత దేశంలో మీ డేటా గోప్యత మీ చేతుల్లోలేదు.. అది వీధి వ్యాపారి చేతిలో ఉంది తెలుసా..’ అని క్యాప్షన్ పెట్టి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన తర్వాత బ్యాంకర్ల నిర్లక్ష్యం ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. ఈ వివరాలు సేకరించి.. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పపడే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి..
ప్రభుత్వ లాంఛనాలతో పవార్ అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని
పనిమనుషులుగా చేరి రూ.18 కోట్లు కొట్టేశారు!