Share News

జమ్మూకశ్మీర్ ఎల్జీగా సక్సేనాకు అదనపు బాధ్యతలు..

ABN , Publish Date - Sep 08 , 2026 | 09:38 PM

జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ఎల్జీగా ఉన్న మనోజ్ సిన్హా సెలవులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

జమ్మూకశ్మీర్ ఎల్జీగా సక్సేనాకు అదనపు బాధ్యతలు..
Ladakh LG Vinai Kumar Saxena

ఢిల్లీ: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ఎల్జీగా ఉన్న మనోజ్ సిన్హా సెలవులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అప్పగించారు. మనోజ్ సిన్హా సెలవులో ఉన్నంతకాలం సక్సేనా జమ్మూకశ్మీర్ ఎల్జీగా విధులు నిర్వర్తించనున్నారు.


అదే సమయంలో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ సక్సేనా తన ప్రస్తుత బాధ్యతలను కొనసాగించనున్నారు. దీంతో ఒకేసారి రెండు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు. జమ్మూకశ్మీర్ పరిపాలనా వ్యవహారాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు కేంద్రం ఈ ఏర్పాటును చేసింది. మనోజ్ సిన్హా తిరిగి బాధ్యతలు స్వీకరించే వరకు సక్సేనా జమ్మూకశ్మీర్ ఎల్జీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మోదీ ముంబై కార్యక్రమ వేదిక వద్ద కలకలం.. ఫేక్‌ ఐడీ, తుపాకీతో ఉన్న ఇద్దరు అదుపులోకి..

భారత జీడీపీ వృద్ధి రేటుతో ప్రపంచ దేశాలకు కొత్త ఆశలు: ప్రధాని మోదీ

Updated Date - Sep 08 , 2026 | 09:38 PM