స్వాతంత్య్ర వేడుకల్లో త్రిష సందడి!
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:33 AM
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడులో అసెంబ్లీ, సచివాలయాలు కలిగి ఉన్న సెయింట్ జార్జ్ కోటపై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ శనివారం తొలిసారిగా...
తమిళనాడు సీఎం విజయ్ తల్లిదండ్రులతో పాటు
ముందు వరుసలో కూర్చొని హడావుడి పరస్పరం సెల్యూట్ చేసుకున్న విజయ్, త్రిష
సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్
చెన్నై, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడులో అసెంబ్లీ, సచివాలయాలు కలిగి ఉన్న సెయింట్ జార్జ్ కోటపై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ శనివారం తొలిసారిగా జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన తల్లిదండ్రులు శోభ, ఎస్‌ఏ చంద్రశేఖర్‌తో పాటు సినీనటి త్రిష కూడా వీఐపీలకు కేటాయించే ముందు వరుసలో అసీనులయ్యారు. సీఎం త్రివర్ణ పతాకం ఎగరవేసే వేదికకు ఎదురుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీఐపీలకు సీట్లు కేటాయించడం పరిపాటి. ఇందులో భాగంగా ముందు వరుసలో విజయ్ తల్లిదండ్రులు, త్రిష, ఆమె తల్లి ఉమ కూర్చున్నారు. విజయ్ టాప్ లేని జీపులో నిలబడి పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తుండగా, ఆ వాహనం తమ ముందుకు వచ్చిన సమయంలో ఆయన తల్లిదండ్రులతో పాటు త్రిష కూడా ఎంతో ఉత్సాహంగా సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా త్రిష.. విజయ్ పరస్పరం సెల్యూట్ చేసుకుంటున్నట్లు కనిపించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. విజయ్ గౌరవవందనం స్వీకరించే దృశ్యాలను త్రిష తన మొబైల్‌లో చిత్రీకరించారు. ఎస్‌ఏ చంద్రశేఖర్‌కు ఎడమ వైపు ఆయన భార్య, కుడివైపున త్రిష ఆసీనులయ్యారు. త్రిష పసుపు, కాషాయం మిళితమైన రంగు చీరను, చంద్రశేఖర్ తెలుపు రంగు, శోభ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించారు. ఈ ముగ్గురూ త్రివర్ణ పతకాన్ని పోలిన రంగుల దుస్తులు ధరించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News