Share News

సత్యభామపై స్టాలిన్ అసభ్యకర వ్యాఖ్యలు.. విజయ్ తీవ్ర ఆగ్రహం..

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:35 PM

తమిళనాడు ధారాపురం ఉప ఎన్నికల ప్రచారం వేళ అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం ముదిరింది. టీవీకే అభ్యర్థి సత్యభామపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు విజయ్ తీవ్రంగా ఖండించారు.

సత్యభామపై స్టాలిన్ అసభ్యకర వ్యాఖ్యలు.. విజయ్ తీవ్ర ఆగ్రహం..
Vijay MK Stalin controversy

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ధారాపురం ఉప ఎన్నికల ప్రచారం వేళ అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం ముదిరింది. టీవీకే అభ్యర్థి సత్యభామపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు విజయ్ తీవ్రంగా ఖండించారు. స్టాలిన్ వ్యాఖ్యలు అసభ్యకరంగా, అవమానకరంగా ఉన్నాయని విజయ్ విమర్శించారు (Vijay MK Stalin controversy).


ధారాపురం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్టాలిన్.. టీవీకే అభ్యర్థి సత్యభామపై విమర్శలు చేశారు. ఆమె గతంలో అన్నాడీఎంకే తరఫున ధారాపురం నుంచి గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరడాన్ని స్టాలిన్ తప్పుపట్టారు. ఈ క్రమంలో సత్యభామను 'సూట్‌కేస్ భామ', 'సోమర్‌సాల్ట్ భామ' అంటూ ఎద్దేవా చేశారు. ఆమె శరీరాకృతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీవీకే నేతలు తీవ్రంగా మండిపడ్డారు. స్టాలిన్ వ్యాఖ్యలపై విజయ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు (MK Stalin Sathyabhama remarks).


మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని విజయ్ పేర్కొన్నారు (Dharapuram bypoll 2026). ధారాపురం ఉప ఎన్నికల ప్రచార సభలో స్టాలిన్ అనాగరిక వ్యాఖ్యలు చేశారని విజయ్ ఆరోపించారు. సత్యభామను ఎగతాళి చేస్తూ, ఆమె పట్ల అవమానకరంగా మాట్లాడారని విమర్శించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం డీఎంకే నేతలకు బాగా అలవాటైందని ఆరోపించారు. తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా ధారాపురం ఓటర్లు ఎన్నికల్లో డీఎంకేకు తగిన సమాధానం చెబుతారని అన్నారు.


ఇవి కూడా చదవండి..

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ


కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..

Updated Date - Oct 03 , 2026 | 05:54 PM