TVK పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై కాసేపట్లో వీసీకే పార్టీ తుది నిర్ణయం!
ABN , Publish Date - May 08 , 2026 | 03:48 PM
విజయ్‌కు చెందిన TVK పార్టీకి మద్దతు ఇవ్వాలా.. వద్దా అనే అంశంపై చర్చించడానికి విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) తన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే దానిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
చెన్నై, మే 7: విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) కాసేపట్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీవీకే (TVK) ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై చర్చించడానికి VCK పార్టీ తన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఈ అంశం మీద వీసీకే పార్టీ అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ మాట్లాడుతూ, తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ (5 స్థానాలు) మద్దతు ప్రకటించడంతో ఆ సంఖ్య 113కు చేరింది. ఇప్పుడు VCK (2 స్థానాలు) వామపక్షాల (CPI(2), CPM(2)) మద్దతు టీవీకేకు అత్యంత కీలకంగా మారింది.
అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇప్పటికే విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో VCK నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు కానుంది. కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదా ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం ముగిసిన తర్వాత VCK అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఒకవేళ VCK, వామపక్షాలు మద్దతు ఇస్తే, విజయ్ ముఖ్యమంత్రి కావడానికి మార్గం మరింత సుగమం అవుతుంది.
ఇవి కూడా చదవండి..
రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News