Share News

‘వందేమాతరం’ వివాదం!

ABN , Publish Date - May 11 , 2026 | 05:50 AM

తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్‌ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలపించిన గీతాలు వివాదానికి దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను...

‘వందేమాతరం’ వివాదం!

ప్రమాణస్వీకారంలో తొలుత వందేమాతరం

చివర్లో తమిళ తల్లి ప్రార్థనా గీతం ఆలాపన

చెన్నై, మే 10(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్‌ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలపించిన గీతాలు వివాదానికి దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను తమిళతల్లి ప్రార్థనా గీతంతో ప్రారంభించి, జాతీయ గీతంతో ముగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, విజయ్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తమిళతల్లి ప్రార్థనా గీతాన్ని మూడోస్థానానికి నెట్టడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై పలువురు కీలక నాయకులు విమర్శలు గుప్పించారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభంలోను, ముగింపులోను కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించారు. దీని ప్రకారం వందేమాతరం గేయాన్ని తొలుత ఆలపించారు. ఈ గేయంలోని ఆరు చరణాలను పాడారు. ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన, చివరగా తమిళ్‌తాయ్‌ వాళ్తు(తమిళ తల్లి ప్రార్థన) ఆలాపించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వందేమాతం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని వందేమాతరం గేయంలోని ఆరు చరణాలను ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పకుండా ఆలపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రొటోకాల్‌ ప్రకారం ఆ ఉత్తర్వులను పాటించారు.

వైగో సహా నేతల ఆగ్రహం

తమిళ తల్లి ప్రార్థనా గీతాన్ని చివరిలో ఆలపించడంపై ఎండీఎంకే నేత వైగో, టీవీకేకు మద్దతిచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం, దళిత్‌ ఫాందర్స్‌ ఆఫ్‌ ఇండియా(డీపీఐ) అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్‌ తదితర పార్టీల నేతలు తప్పుబట్టారు. ఇంతకుముందు ఆర్‌.ఎన్‌. రవి గవర్నర్‌గా వ్యవహరించినప్పుడు తమిళతల్లి ప్రార్థనా గీతాన్ని జాతీయ గీతం తర్వాతే పాడాలని అసెంబ్లీ ప్రొటోకాల్‌ను మార్చాలని తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయాన్ని వారు గుర్తు చేశారు. మరోవైపు, లోక్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం ప్రొటెం స్పీకర్‌గా కరుప్పయ్య ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలో కూడా తమిళతల్లి ప్రార్థనా గీతం మూడోస్థానంలో ఉంచడంపై కూడా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మిత్రపక్షాల నేతలు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 05:50 AM