Share News

ఇలాగైతే... అమెరికాలో ఉండలేం!

ABN , Publish Date - May 21 , 2026 | 06:13 AM

మెటా, అమెజాన్‌ తదితర దిగ్గజ టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోత హెచ్‌-1 వీసాపై ఉన్న వేలాది మంది భారతీయ నిపుణుల జీవితాలను తీవ్ర అనిశ్చితిలోకి నెడుతోంది. వీసా నిబంధనల ప్రకారం...

ఇలాగైతే... అమెరికాలో ఉండలేం!

  • భారీసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న దిగ్గజ టెక్‌ కంపెనీలు

  • 60రోజుల్లోగా కొత్త ఉద్యోగం రాకపోతే దేశం విడిచి వెళ్లాల్సిందే

  • హెచ్‌-1బీ వీసాపై ఉన్న వేలాది మంది భారతీయుల అవస్థలు

న్యూఢిల్లీ, మే 20: మెటా, అమెజాన్‌ తదితర దిగ్గజ టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోత హెచ్‌-1 వీసాపై ఉన్న వేలాది మంది భారతీయ నిపుణుల జీవితాలను తీవ్ర అనిశ్చితిలోకి నెడుతోంది. వీసా నిబంధనల ప్రకారం.. ఉద్యోగం కోల్పోయిన తర్వాత అమెరికాలో చట్టబద్ధంగా నివసించడానికి 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ మాత్రమే ఉంటుంది. ఈ గడువులోగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడం లేదా వీసా స్టేట్‌సను మార్చుకోవడం తప్పనిసరి. ఇందులో విఫలమైతే దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీంతో కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిన భారతీయులు ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సి వస్తోంది. వీరిలో చాలామంది గ్రీన్‌కార్డు దరఖాస్తులు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 60 రోజుల గడువును పొడిగించుకోవడానికి ఉద్యోగాలు కోల్పోయినవారిలో పలువురు తాత్కాలికంగా బీ-2 విజిటర్‌ వీసాకు మారడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వీసాతో అమెరికాలో 6 నెలల పాటు ఉండవచ్చు. అయితే కఠిన వలస నిబంధనల నేపథ్యంలో ప్రస్తుతం ఈ మార్గం కూడా కష్టతరంగా మారుతోందని ఇమిగ్రేషన్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 2026లో ఇప్పటి వరకూ 144 టెక్‌ కంపెనీల్లో 1,11,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో వేలాది మంది హెచ్‌-1బీ వీసాపై ఉన్న భారతీయులేనని అంచనా. వీరిలో చాలామంది యూరప్‌, కెనడా తరలిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ఇమిగ్రేషన్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 06:13 AM