జమ్మూ కశ్మీర్ ఉరీ సెక్టార్‌లో ప్రమాదం.. గ్రనేడ్ పేలి ఇద్దరు జవాన్ల మృతి
ABN , Publish Date - Jun 10 , 2026 | 07:38 AM
జమ్మూ కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్ కమల్‌కోట్ ఆర్మీ క్యాంపులో ఘోర ప్రమాదం జరిగింది. గ్రనేడ్ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు..
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరీ సెక్టార్‌లోని కమల్‌కోట్ ఆర్మీ క్యాంపులో జరిగిన గ్రనేడ్ పేలుడు ప్రమాదంలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కమల్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరీ సెక్టార్, కమల్‌కోట్ పరిధిలోని సరిహద్దు రక్షణ శిబిరంలో జవాన్లు తమ విధులను ముగించుకుని.. ఆయుధాలు, ఇతర పరికరాలను తోటి సిబ్బందికి అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న ఒక హ్యాండ్ గ్రనేడ్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ తీవ్రమైన పేలుడు ధాటికి అక్కడే ఉన్న ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇద్దరు సైనికులను తోటి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదకర ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అడిగి మరీ మసాజ్ చేయించుకున్న ఏనుగు.. వైరల్ వీడియో
కొంపముంచిన రూ. 370 బిర్యానీపై కామెంట్లు.. ఇలా జరుగుతుందని అనుకోలేదు..