Share News

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ విడుదల

ABN , Publish Date - May 28 , 2026 | 05:12 AM

సివిల్‌ సర్వీసెస్‌-2026 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ...

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ విడుదల

న్యూఢిల్లీ, మే 27: సివిల్‌ సర్వీసెస్‌-2026 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్‌ ముగిసిన మూడు రోజుల్లోనే అధికారికంగా ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీని విడుదల చేయడం యూపీఎస్సీ చరిత్రలోనే ఇదితొలిసారి. గతంలో మొత్తం రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తయ్యాకే కీని విడుదల చేసేవారు. ఇప్పుడు అభ్యర్థులకు మేలు జరిగేలా, పారదర్శకత కోసం పరీక్ష ముగిసినమూడు రోజుల్లోనే విడుదల చేశారు. ఇక ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 31వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు upsconline.nic.in లో అందుబాటులో ఉన్న ప్రత్యేక పోర్టల్‌ ((QPRep)) ద్వారా అభ్యర్థులు సంబంధిత పత్రాలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 05:12 AM