పని తక్కువగా ఉంది.. సగం జీతమే ఇవ్వండి.. ప్రభుత్వానికి ఓ ఐఏఎస్ అధికారి అభ్యర్థన..
ABN , Publish Date - Jul 21 , 2026 | 10:39 AM
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహీ తనకు సగం జీతమే చెల్లించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించడం చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహీ తనకు సగం జీతమే చెల్లించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించడం చర్చనీయాంశంగా మారింది. తనకు రోజుకు నాలుగు గంటలే పని ఉంటోందని, అందువల్ల తన జీతాన్ని సగానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం తనకు అప్పగించిన బాధ్యతల్లో పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం లేదన్నారు (UP IAS officer half salary request).
2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహీ (Rinku Singh Rahi) ప్రస్తుతం యూపీ ఎస్‌డీఎం (జ్యుడీషియల్)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులో రోజుకు సుమారు నాలుగు గంటల పని మాత్రమే ఉంటోందని, ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా పరిమితంగా ఉందని ఆయన తెలిపారు. అందువల్ల పూర్తి జీతం తీసుకోవడం నైతికంగా సరైంది కాదని భావిస్తున్నానని, అందువల్ల సగం జీతమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే తన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే పోస్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపాలనా వ్యవస్థకు తాను తగినవాడినేనా అన్నది కూడా సమీక్షించాలని నియామకాలు, సిబ్బంది శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో రింకూ సింగ్ కోరారు (Uttar Pradesh IAS). ఒకవేళ రాష్ట్రంలో తాను పని చేసేందుకు అనర్హుడినని తేలితే నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరారు. భూ కబ్జాలు, అక్రమ మైనింగ్ కార్యకలాపాలు, ప్రజా ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నప్పుడు తనపై అనేక ఒత్తిళ్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నేపాల్ రూపాయి డిజైన్ మార్పు.. భారత భూభాగాల తొలగింపు..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..