ఆరంభ లాభాలు ఆవిరి.. స్వల్ప నష్టాల్లో సూచీలు..
ABN , Publish Date - Jul 21 , 2026 | 09:57 AM
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నష్టాలు చవిచూసిన సూచీలు మంగళవారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. మంగళవారం ఉదయం కాసేపు లాభాల్లో కదలాడిన సూచీలు తిరిగి నష్టాల బాట పట్టాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నష్టాలు చవిచూసిన సూచీలు మంగళవారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. మంగళవారం ఉదయం కాసేపు లాభాల్లో కదలాడిన సూచీలు తిరిగి నష్టాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.33గా ఉంది. సోమవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న బ్యాంకింగ్ సెక్టార్ మంగళవారం లాభాల్లో కొనసాగుతోంది. (Indian stock market).
గత సెషన్ ముగింపు (77,708)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. తిరిగి నష్టాల బాట పట్టింది. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 104 పాయింట్ల నష్టంతో 77,604 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 18 పాయింట్ల నష్టంతో 24,220 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మణప్పురం ఫైనాన్స్, ఎన్‌హెచ్‌పీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, నవుమా వెల్త్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). డిక్సన్ టెక్నాలజీస్, సుప్రీమ్ ఇండస్ట్రీస్, కల్యాణ్ జువెల్లర్స్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 135 పాయింట్ల లాభంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
నేపాల్ రూపాయి డిజైన్ మార్పు.. భారత భూభాగాల తొలగింపు..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..