Share News

ఉక్రెయిన్‌లో ఘోర విషాదం.. ఓడపై దాడిలో నలుగురు భారతీయుల మృతి..

ABN , Publish Date - Jul 21 , 2026 | 08:43 AM

ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఉక్రెయిన్‌లో ఘోర విషాదం.. ఓడపై దాడిలో నలుగురు భారతీయుల మృతి..
Ukraine Odesa attack

ఉక్రెయిన్‌లోని ఒడెసా (Odesa) నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించింది (Ukraine Odesa attack).


గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ గోల్డెన్ లియో (MV Golden Leo) అనే వాణిజ్య నౌక ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు నుంచి బయలుదేరుతున్న సమయంలో దాడికి గురైంది. నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. ఈ దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందగా, మరో భారతీయుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.


రష్యా ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు ఈ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకున్నాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో నౌక తీవ్రంగా దెబ్బతింది. ఇటీవల నల్ల సముద్రం (Black Sea) ప్రాంతంలో రష్యా-ఉక్రెయిన్ దాడులు తీవ్రం కావడంతో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. నల్ల సముద్రంలోని పోర్టులు, వాణిజ్య నౌకలు తరచూ దాడులకు గురవుతున్నాయి ( 4 Indians killed, Odesa port).


ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది (Russia Ukraine war). వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, అమాయక పౌరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛకు విరుద్ధమని పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన భారతీయుడికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

నేపాల్ రూపాయి డిజైన్ మార్పు.. భారత భూభాగాల తొలగింపు..


పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 21 , 2026 | 08:44 AM