యూపీని ముంచెత్తిన భారీ వర్షాలు.. 56 మంది మృతి, వందలాది మూగజీవాలు బలి
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:31 PM
ఉత్తర్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 56 మంది మృతి చెందగా, 1,021 ఇళ్లు ధ్వంసమయ్యాయి, 107 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 27: ఉత్తర్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 56 మంది మృతి చెందగా, 1,021 ఇళ్లు ధ్వంసమయ్యాయి, 107 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.
మరణాల్లో అత్యధికంగా సీతాపూర్‌లో 7 మంది మరణించగా, లఖింపూర్ ఖేరి, బహ్రైచ్, బలరాంపూర్‌లలో 5 గురు చొప్పున, అయోధ్య, గోరఖ్‌పూర్‌లలో నలుగురు చొప్పున మరణించారు. హర్దోయీ జిల్లాలో గరిష్టంగా 272 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
సాధారణ సగటు వర్షపాతం 7.6 మి.మీ ఉండాల్సిన చోట, శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఏకంగా 66.5 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్లే ఈ స్థాయిలో వర్షాలు కురిసాయని అధికారులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి