Share News

340 కోట్ల మందికి సరైన ఇళ్లు లేవు: ఐరాస

ABN , Publish Date - May 21 , 2026 | 04:59 AM

ప్రపంచ జనాభాలో 40% మంది.. అంటే దాదాపు 340 కోట్ల మంది ప్రజలు గృహ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వరల్డ్‌ సిటీస్‌ రిపోర్ట్‌ వెల్లడించింది....

340 కోట్ల మందికి సరైన ఇళ్లు లేవు: ఐరాస

బాకు, మే 20: ప్రపంచ జనాభాలో 40% మంది.. అంటే దాదాపు 340 కోట్ల మంది ప్రజలు గృహ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వరల్డ్‌ సిటీస్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. ఇళ్ల కొరత, ధరల భారం, నాణ్యత లోపంతోపాటు స్వచ్ఛమైన నీరు, పారిశుధ్య సదుపాయాల కొరత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని మంగళవారం వెల్లడైన ఈ నివేదిక పేర్కొంది. 2050 నాటికి మరో 200 కోట్ల మంది అదనంగా నగరాలకు వలస వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో... అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన కార్యక్రమంలో వరల్డ్‌ సిటీస్‌ రిపోర్ట్‌-2026ను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. పట్టణీకరణ, పెరుగుతున్న భూమి ధరలు, తీవ్రమవుతున్న భూ అసమానతలు, వాతావరణ మార్పుల వల్ల ఇళ్ల కొరత తీవ్రమవుతుందని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆదాయాల కంటే ఇళ్ల ధరలు ఎక్కువగా పెరిగాయని తెలిపింది. 2010లో 9:3గా ఉన్న ఇళ్ల ధర, ఆదాయ నిష్పత్తి.. 2023లో 11:2కు పెరిగిందని సూచించింది. భారత్‌ సహా మధ్య, దక్షిణాసియాలో ఇది 16:8కి పెరిగిందని తెలిపింది. ప్రజలు అద్దె భరించే స్థితి కూడా క్షీణిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా 44 శాతం కుటుంబాలు తమ ఆదాయంలో 30 శాతానికిపైగా గృహవసతి కోసమే ఖర్చు చేస్తున్నాయని వివరించింది. ముంబై, ఢిల్లీల్లో ఇళ్ల ధర, ఆదాయ నిష్పత్తి 14:3, 10:1గా ఉండడంతో మధ్యస్థ ఆదాయం కలిగిన కుటుంబాలకు సొంతింటి కల.. కలగానే మిగిలిపోతోంది. చైనాలో ప్రతి 10వేల మందిలో 21 మంది నిరాశ్రయులు ఉంటే.. భారత్‌లో ఈ సంఖ్య 13గా, అమెరికాలో 20గా, బ్రెజిల్‌లో 11గా ఉందని ఈ నివేదిక తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 04:59 AM