ఉద్ధవ్ శివసేనలో ఫిరాయింపుల బెడద.. ఎంపీలతో అత్యవసర సమావేశం
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:22 PM
రెబల్ ఎంపీలతో తృణమూల్ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో తాజాగా మహారాష్ట్రలోని ఉద్ధవ్ శివసేన లోనూ ఇదే తరహా పరిస్థితే కనిపిస్తోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. శివసేన యూబీటీకి చెందిన పలువురు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేతో మంతనాలు సాగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ముంబై: రెబల్ ఎంపీలతో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతుండగా తాజాగా మహారాష్ట్రలోని ఉద్ధవ్ శివసేన (UBT)లోనూ ఇదే తరహా పరిస్థితే కనిపిస్తోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. శివసేన యూబీటీకి చెందిన పలువురు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేతో మంతనాలు సాగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఉద్ధవ్ థాకరే అప్రమత్తమయ్యారు. పార్టీ నేతలు, ఎంపీలతో బాంద్రా ఈస్ట్ ప్రాంతంలోని మాతోశ్రీ నివాసంలో కీలక సమావేశాన్ని ఆదివారంనాడు ఏర్పాటు చేశారు.
లోక్‌సభలో శివసేన ఎంబీటీకి తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు యూబీటీ కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎంపీలు సంజయ్ హరిబావు జాదవ్, భౌసాహెబ్ రాజారామ్ వాకచౌరే, ఓంప్రకాష్ రాజెనింబాల్కర్‌లు ఈ సమావేశానికి దూరంగా ఉండిపోయారు. యూబీటీలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు షిండే శివసేనలో చేరేందుకు సంప్రదింపులు సాగిస్తురంటూ గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది.
శివసేనలో చేరే ప్రతిపాదనతో జూన్ 7న పలువురు యూబీటీ ఎంపీలు షిండేను కలుసున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామానికి బలం చేకూరుస్తూ కేంద్ర మంత్రి, శివసేన ఎంపీ ప్రతాప్‌రావు జాదవ్ ఇటీవల ఒక ప్రకటన చేశారు. 'ఆపరేషన్ టైగర్' దాదాపు పూర్తి కావచ్చందని ఆయన వ్యాఖ్యానించారు. షిండే ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఈ ఆపరేషన్ పూర్తవుతుందన్నారు.
లోక్‌సభలో బలాబలాలు
ప్రస్తుతం షిండే శివసేనకు చెందిన ఏడుగురు ఎంపీలు లోక్‌సభలో ఉన్నారు. ఎన్డీయేలో బీజేపీ, టీడీపీ, జేడీయూ తర్వాత అతిపెద్ద భాగస్వామిగా ఆ పార్టీ ఉంది. యూబీటీకి చెందిన ఏడుగురు ఎంపీలు శివసేనలో చేరాలనుకుంటే యూబీటీలో చీలిక అనివార్యమవుతుంది. లోక్‌సభలో ఎన్డీయే సభ్యుల బలం పెరుగుతుంది. సంఖ్యాబలం ఆధారంగా బీజేపీలో చేరే ఎంబీటీ ఎంపీలపై ఎలాంటి పార్టీ ఫిరాయింపుల వేటు కూడా పడదు.
పార్టీ ఐక్యంగానే ఉంది: యూబీటీ
కాగా, తమ పార్టీ ఐక్యంగానే ఉందని, ఎలాంటి చీలక లేదని శివసేన యూబీటీ తెలిపింది. తదుపరి జనరేషన్‌ను ఆదిత్య థాకరే ముందుకు తీసుకు వెళ్తారని పేర్కొంది. పార్టీని, రాష్ట్ర భవిష్యత్తుకు ఆదిత్య ప్రాతినిధ్యం వహిస్తారని, సమస్యలపై లోతైన అవగాహన ఆయనకు ఉందని యూబీటీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. 'ఆదిత్య పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. మా జనరేషన్ క్రమంగా వెనక్కి మళ్లుతుంది. కొత్త నాయకులు ముందుకు వస్తే వారికి మేము సహకరించి, పార్టీ ప్రగతికి దోహదపడతాం' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కనీసం సంతాపం కూడా తెలియజేయరా? యూఎస్‌పై శశి థరూర్ ఆగ్రహం
అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం.. 18 ఏళ్లు నిండిన వారికి ఇకపై నో ఆధార్..