Share News

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం.. 18 ఏళ్లు నిండిన వారికి ఇకపై నో ఆధార్..

ABN , Publish Date - Jun 14 , 2026 | 10:38 AM

18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డులు జారీ చేయకూడదని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. అక్రమ వలసదారులు ఆధార్ పొందకుండా అడ్డుకునేందుకు మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం.. 18 ఏళ్లు నిండిన వారికి ఇకపై నో ఆధార్..
Assam Aadhaar Rules

గువాహటి, జూన్ 14: 18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డులు జారీ చేయకూడదని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. అక్రమ వలసదారులు ఆధార్ పొందకుండా అడ్డుకునేందుకు మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 18 ఏళ్లు దాటిన వారికి ఆధార్ కార్డు జారీ చేయకూడదని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.


ఎస్సీ, ఎస్టీ, టీ తోటల్లో పనిచేసే వారు 2027 మార్చి 31వ తేదీ వరకు ఆధార్ కార్డులు పొందవచ్చని తెలిపారు. ఈ ఉత్తర్వు 2027 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలుల్లోకి వస్తుందని, ఆ తేదీ నుంచి పైన పేర్కొన్న వర్గాలకు చెందిన 18 సంవత్సరాల పైబడిన వారికి కూడా ఆధార్ కార్డుల జారీ నిలిచిపోతుందని ఆయన వెల్లడించారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆధార్ కార్డ్ జారీ చేయడానికి అనుమతి కోరుతూ జిల్లా కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుందని అన్నారు.


ఆధార్ కార్డు కోసం విజ్ఞప్తి చేసుకున్న వ్యక్తి అర్హుడా కాదా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల జారీ సంపూర్ణ స్థాయికి చేరుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఆధార్ కార్డుల జారీ 100 శాతాన్ని కూడా దాటిందన్నారు. అదనంగా ఆధార్ కార్డులు తీసుకుంటున్న వ్యక్తులు ఎవరో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


ఇవి కూడా చదవండి

అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్‌ మీట్‌ను మధ్యలో ఆపేసిన నితీశ్‌కుమార్ రెడ్డి

రోహిత్ శర్మ రనౌట్‌పై స్పందించిన శుభ్‌మన్ గిల్

Updated Date - Jun 14 , 2026 | 11:01 AM