Share News

AIADMKకి సినీ నటి గౌతమి రాజీనామా

ABN , Publish Date - Jun 14 , 2026 | 02:31 PM

ఏఐఏడీఎంకేకి షాక్‌నిస్తూ ఆ పార్టీకి చెందిన సినీ నటి గౌతమి రాజీనామా చేశారు. సంబంధిత రాజీనామా పత్రాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి పంపారు.

AIADMKకి సినీ నటి గౌతమి రాజీనామా
Gauthami

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం(AIADMK)కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ప్రముఖ సినీ నటి గౌతమి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన పదవికీ ఆమె రిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామికి తన రాజీనామా లేఖను పంపారామె.


రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమి పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం తాను చేసిన కృషిని గుర్తుచేసుకున్న ఆమె.. భవిష్యత్తులో ప్రజాసేవ పట్ల నిబద్ధతను కొనసాగిస్తానన్నారు. అయితే.. రాజీనామాకు దారితీసిన కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు.

సినీరంగంలో విశేష గుర్తింపు పొందిన గౌతమి.. రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. బీజేపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె.. బీజేవైఎమ్ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత ఏఐఏడీఎంకేలో చేరి, పార్టీ తరఫున వివిధ కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. అలాంటి సమయంలో ఆమె ఆకస్మిక రాజీనామా తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. గౌతమి నిర్ణయంపై పార్టీ నాయకత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఆమె మరో రాజకీయ పార్టీ వైపు ఏమైనా అడుగులు వేయబోతున్నారా లేక స్వతంత్రంగా ప్రజాసేవ కొనసాగిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.


ఇవీ చదవండి:

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం.. 18 ఏళ్లు నిండిన వారికి ఇకపై నో ఆధార్..

బల్క్ డీజిల్ కొనుగోళ్లపై ఆంక్షలు.. ఆసుపత్రుల్లో ఆందోళన

Updated Date - Jun 14 , 2026 | 03:25 PM