ట్విష మృతి కేసులో అత్త అరెస్టు
ABN , Publish Date - May 29 , 2026 | 05:17 AM
మాజీ మిస్ పుణె, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...
న్యూఢిల్లీ, మే 28: మాజీ మిస్ పుణె, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు సహకరించడం లేదనే కారణంతో ట్విష అత్త, విశ్రాంత న్యాయమూర్తి అయిన గిరిబాలాసింగ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఆమెకు సెషన్స్ కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన మరుసటి రోజే ఈ అరెస్టు జరిగింది. గురువారం ఉదయం 10.30 గంటలకు భోపాల్‌లోని గిరిబాలాసింగ్ నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు ఆమెను సుదీర్ఘంగా విచారించి.. సాయంత్రం 5.10 గంటల సమయంలో అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News