ట్రంప్‌కిఎదురుదెబ్బ.. జ్ఞానేశ్‌కు గాయం..!!
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:22 AM
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలతో ట్రంప్‌ను వెక్కిరించేలా రూపొందించిన ఏఐ వీడియోలు, ఫొటోలతో ట్రోలర్లు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు.
ట్రంప్, సీఈసీ జ్ఞానేశ్‌పై భారీగా ట్రోల్స్
గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు ఎదుర్కోనంతగా ట్రంప్‌పై ట్రోలింగ్
హైదరాబాద్, నవంబరు 4: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలతో ట్రంప్‌ను వెక్కిరించేలా రూపొందించిన ఏఐ వీడియోలు, ఫొటోలతో ట్రోలర్లు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు ఎదుర్కోని విధంగా ట్రంప్‌పై ప్రపంచ వ్యాప్తంగా ట్రోలింగ్ జరిగింది. ట్రంప్‌ను విమర్శిస్తూ లక్షల సంఖ్యలో పోస్టులు సోషల్ మీడియాలో పోటెత్తాయి. సునామీకి బదులు బ్లునామీ(డెమోక్రాట్లు పార్టీని సూచిస్తూ నీలం రంగు) అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెట్టారు. నీలి రంగు భారీ కెరటంలో ట్రంప్ గల్లంతైనట్టు వీడియోలు రూపొందించారు. చెత్త బుట్టలో ట్రంప్‌ను పడేస్తున్నట్టు రూపొందించిన ఏఐ వీడియోను భారత్‌లోని ఇరాన్ ఎంబసీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఓట్ చోరీ ఆందోళనలతో దేశంలో సంచలనంగా మారిన జ్ఞానేశ్‌కుమార్ కూడా అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల సెగ తగిలింది. అమెరికా ఎన్నికల ఫలితాలు, ట్రంప్, మోదీ స్నేహం, జ్ఞానేశ్ కుమార్‌ను జోడిస్తూ రూపొందించిన జోకులు, ఫొటోలతో కొందరు ట్రోలింగ్ చేశారు. ‘‘జ్ఞానేశ్‌కుమార్ అయితే ట్రంప్‌కు ఇలా జరగనిచ్చేవారు కాదు’’ అంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘మిత్రమా ట్రంప్.. జ్ఞానేశ్‌ను నీ దగ్గరకు పంపలేకపోయినందుకు క్షమించూ’’ అంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డెమోక్రాట్లపై ట్రంప్ చివరి అస్త్రం! ఎలా పనిచేస్తుందంటే.
అమెరికా తొలి ముస్లిం సెనెటర్ భార్యకు భారతీయ మూలాలు