ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ABN , Publish Date - Aug 10 , 2026 | 02:35 PM
విపక్షాల ఆందోళనల నడుమ ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది.
ఇంటర్నెట్ డెస్క్: విపక్షాల ఆందోళనల నడుమ ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది. అనంతరం లోక్‌సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. ట్రైబ్యునళ్ల సారథులు, సభ్యుల అర్హతలు, నియామక ప్రక్రియలో సమర్థత, పారదర్శకతను పెంచి ఏకరూపతను సాధించాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ‘ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు’ను సిద్ధం చేశారు.
‘నేషనల్ ట్రైబ్యునల్ కమిషన్’ ఏర్పాటుకు విధివిధానాలను దీనిలో పొందుపరిచారు. ఒక ఛైర్‌పర్సన్, నలుగురు సభ్యులతో ఇది ఏర్పాటవుతుంది. వీరిలో ఇద్దరు న్యాయ రంగం నుంచి, ఇద్దరు సాంకేతిక రంగం నుంచి ఉంటారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తిని గానీ, హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తిని గానీ కమిషన్ సారథిగా నియమిస్తారు.
ఇవి కూడా చదవండి:
మోదీని నవ్వించిన బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
రెస్టారెంట్‌లో భారత మ్యాప్‌పై లవ్లీనా అభ్యంతరం.. ఆమె చర్యను ప్రశంసించిన మోదీ