పశ్చిమ బెంగాల్‌లో బీజేపీదే విజయం: టుడేస్ చాణక్య
ABN , Publish Date - Apr 30 , 2026 | 07:45 PM
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పోలింగ్ ఏజెన్సీ టుడేస్ చాణక్య వెల్లడించింది. మెుత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 192 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పోలింగ్ ఏజెన్సీ టుడేస్ చాణక్య వెల్లడించింది. మెుత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 192 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సుమారు 100 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇతర పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థులకు మరో రెండు సీట్లు దక్కవచ్చని అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ జరిగిన ఒక రోజు తర్వాత టుడేస్ చాణక్య తన ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. తమ అంచనా ప్రకారం బెంగాల్‌లో కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని చాణక్య పేర్కొంది.
మరోవైపు బుధవారం నాడు పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే అనేక పోలింగ్ ఏజెన్సీలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. అందులో మెజారిటీ పోల్స్ అన్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. బీజేపీ 146 నుంచి 161 సీట్లు కైవసం చేసుకుంటుందని.. టీఎంసీ 125 నుంచి 140 సీట్లు సాధిస్తుందని మ్యాట్రిజ్ సంస్థ తెలిపింది. బీజేపీ 150 నుంచి 175 సీట్లు, టీఎంసీ 118 నుంచి 138 సీట్లు కైవసం చేసుకుంటాయని పీ-మార్క్ సంస్థ వెల్లడించింది.
అలాగే బీజేపీ 142 నుంచి 171, టీఎంసీ 99 నుంచి 167 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పోల్ డైరీ పేర్కొంది. మరోవైపు జన్‌మత్, పీపుల్స్ పల్స్ మాత్రం తృణమూల్ కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. ఈ పార్టీ 177 నుంచి 205 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మెుత్తం 294 సీట్లు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 148 సీట్లు రావాల్సి ఉంటుంది. కాగా, తమకు వ్యతిరేకంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. వాటిని బీజేపీ కార్యాలయం నుంచి వచ్చిన అంచనాలుగా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను గెలిచి, టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
విజయం టీఎంసీదే.. ఎగ్జిట్ పోల్స్‌పై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ..
టీవీకే పార్టీతో చర్చలు.. యోచనలో అన్నాడీఎమ్‌కే