Share News

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆఫీస్‌పై కోడిగుడ్లు, కూరగాయలతో దాడి..

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:18 PM

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా కార్యాలయంపై బీజేపీ ఆందోళనకారులు దాడి చేశారు. బుధవారం కృష్ణానగర్‌లోని ఆమె కార్యాలయంపై కోడిగుడ్లు, కూరగాయలు విసిరారు.

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆఫీస్‌పై కోడిగుడ్లు, కూరగాయలతో దాడి..
Mahua Moitra

కోల్‌కతా, జులై 1: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా కార్యాలయంపై బీజేపీ ఆందోళనకారులు దాడి చేశారు. బుధవారం కృష్ణానగర్‌లోని ఆమె కార్యాలయంపై కోడిగుడ్లు, కూరగాయలు విసిరారు. దాడి జరిగిన సమయంలో మహువా మొయిత్రా కార్యాలయంలోనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆమె వీడియో తీశారు. ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఏం జరుగుతోందో చూడండి. నేను గంట సేపటినుంచి కిటికీ దగ్గర నిల్చుని ఉన్నాను. నేను డీజీపీతో పాటు అందరికీ ఫోన్ చేశాను. కానీ, పోలీసులు అక్కడ కూర్చుని చూస్తున్నారు’..


‘ఇది నా ఏరియా, నేను ఇక్కడ ఎంపీని. నేను నా ఆఫీస్‌లో ఉన్నాను. నేను ఇక్కడినుంచి వెళ్లను. ఒక్కసారి వాళ్ల ముఖాలు చూడండి. వాళ్లు మా వాళ్లు కాదని ప్రభుత్వం అంటుంది. పోలీసులు, కోర్టులు ఈ దారుణాన్ని పట్టించుకోవు’ అని అన్నారు. కాగా, మంగళవారం కోల్‌కతా హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై గుడ్లు విసిరిన ప్రతీ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చూసుకోమని ఆదేశించింది. ఇక, గుడ్లు విసిరే ఘటనలపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సామిక్ భట్టాచార్య స్పందిస్తూ.. గుడ్లు విసరటం బీజేపీ సంప్రదాయం కాదని అన్నారు. పార్టీకి చెందిన వాళ్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరారు. లేదంటే పార్టీ పేరు దెబ్బతింటుందని అన్నారు.


ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి

ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!

Updated Date - Jul 01 , 2026 | 05:23 PM