Share News

టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:10 PM

ప్రైమరీ స్కూలు ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శుక్రవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు.

టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ
Abhisekh Banerjee

కోల్‌కతా: ప్రైమరీ స్కూలు ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) శుక్రవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరయ్యారు. దీనికి ఒకరోజు ముందే అసెంబ్లీలో విపక్ష నేత నియామకానికి సంబంధించి టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో సీఐడీ ముందు ఆయన హాజరయ్యారు. సుమారు ఎనిమిదిన్నర గంటల సేపు విచారణను ఎదుర్కొన్నారు.


కాగా, టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌ కేసులో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న ఈడీ కార్యాలయం ముందు మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో అభిషేక్ హాజరైనట్టు అధికారులు తెలిపారు. టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేయడంతో అభిషేక్ హాజరయ్యారు. ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులు, ఇతర నిందితుల వాంగ్మూలం ఆధారంగా అభిషేక్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్టు ఈడీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తాము సేకరించిన బ్యాంకు రికార్డులు, కమ్యూనికేషన్ డాటా ఆధారంగా మనీలాండరింగ్‌లో ఎవరెవరి ప్రమేయం ఉందో తెలుసుకుంటామని చెప్పారు.


పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీ వంటి పలువురు టీఎంసీ నేతలు జనాగ్రహం చవిచూడటం, వారిపై దాడులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసిన ఆరోపణలను అభిషేక్ ఎదుర్కొంటున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని నిషేధించేవారు: అశోక్‌ గహ్లోత్‌

రాజ్యసభలో 2/3 మెజారిటీ దిశగా ఎన్డీయే

Updated Date - Jun 15 , 2026 | 03:16 PM