టీఎంసీ ఆందోళనకు ఎమ్మెల్యేల డుమ్మా
ABN , Publish Date - May 21 , 2026 | 05:02 AM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రె్‌స(టీఎంసీ) పార్టీ నిర్వహించిన తొలి ఆందోళనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో గైర్హాజరయ్యారు...
80 మందిలో 35 మందే హాజరు
కోల్‌కతా, మే 20: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రె్‌స(టీఎంసీ) పార్టీ నిర్వహించిన తొలి ఆందోళనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో గైర్హాజరయ్యారు. ఇప్పుడిది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస, వీధి వ్యాపారుల తొలగింపు చర్యలను నిరసిస్తూ టీఎంసీ ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 35 మంది మాత్రమే ఈ ఆందోళనలో పాల్గొనడం గమనార్హం. తిరిగి వీధి పోరాటాలకు వెళ్లాలని పార్టీ అంతర్గత చర్చలో అభిప్రాయం వ్యక్తమైన తర్వాతి రోజే ఈ పరిణామం ఎదురవడం రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తావిచ్చింది. అంతర్గత విభేదాలే ఎమ్మెల్యేల గైర్హాజరుకు కారణమనే వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత రేసులో ఉన్న సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ తోసిపుచ్చారు. ప్రయాణ సంబంధ సమస్యలు, సంస్థాగత బాధ్యతల్లో బిజీగా ఉండటం వల్ల అనేకమంది ఎమ్మెల్యేలు హాజరు కాలేకపోయారని సోవన్‌దేవ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు